వివరణ

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి
వివరణ
         
తిరుపతి, 2010 ఆగష్టు 25: ఆగష్టు 24వ తేదిన ”ఆంధ్రజ్యోతి” దినపత్రిక నందు ప్రచురించిన ”టిటిడి ప్రత్యేక అథారిటీ చైర్మన్‌ ఎవరో?’ రమణాచారి నియామకానికి కృష్ణారావు విముఖత అని ప్రచురించిన వార్త వాస్తవ దూరం.

రమణాచారికి చైర్మన్‌ గా బాధ్యతలను అప్పగించనివ్వకుండా అడ్డుపడుతున్నారని ఆరోపణలున్నాయని, చైర్మన్‌గా కూడా తనే వ్యవహరించాలన్న ఉద్ధేశ్యంతో ఇ.ఓ.కృష్ణారావు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది అని ప్రచురించడం కూడా నిజం కాదని తెలియజేస్తున్నాం. ఊహాజనితంగా ఇటువంటి వార్తలు వ్రాయడం బాధాకరం. కనుక ఈ సమాచారాన్ని రేపటి మీ దినపత్రికలో ఈ విషయాన్ని వివరణగా ప్రచురించాల్సిందిగా కోరుచున్నాము.

ప్రజాసంబంధాల అధికారి

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి