వివరణ

తిరుమల తిరుపతి దేవస్థానములు
                                           వివరణ

         హంపి విరూపాక్ష విద్యారణ్య మహపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య స్వామివారికి 2000 సంవత్సరం నుండే తి.తి.దే స్పెసిఫైడ్‌ అథారిటీ నిర్ణయం మేరకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆలయ మర్యాదలు, మహద్వారం ప్రవేశం యున్నాయని తి.తి.దే కార్యనిర్వహణాధికారి శ్రీకె.వి.రమణాచారి నేడొక ప్రకటనలో తెలిపారు. 2000 సంవత్సరం జనవరి 20వ తేదిన విడుదలైన నిర్దేశం ఆ2/434/శ్రీటి.టి/టి.యమ్‌.యల్‌/99 ప్రకారం శ్రీశ్రీశ్రీజగద్గురుస్వామివారికి యీ అర్హతలు లభించాయని ఆయన తెలిపారు.

          శ్రీవారికి మహాద్వారం ప్రవేశం విషయంలో ఉన్నతాధికారులు నిబంధనలు పాటించకుండ ‘అత్యుత్సాహం’ ప్రదర్శిస్తున్నారని, ఫలితంగా వివాదాలు, విమర్శలు వస్తున్నాయని మీడియాలో కథనాలు రావడం పట్ల తి.తి.దే కార్యనిర్వహణాధికారి ఆశ్చర్యం, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో సంబంధమున్న యిలాంటి సున్నితమైన విషయాలలో  ఏకపక్షంగా కథనాలు రాయడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.

తి.తి.దే స్పెసిఫైడ్‌ అథారిటి నిర్ణయం మేరకు శ్రీవారి ఆలయం అధికారులు హంపి పీఠాధిపతికి మహాద్వార ప్రవేశం కల్పించారని, యిందులో ఎలాంటి వివాదం లేదని శ్రీకె.వి.రమణాచారి పేర్కొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.