SRI VENKATESWARA SAMOOHIKA VRATAM HELD _ విశాఖపట్నంలో వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి సామూహిక వ్రతం

Tirupati, 13 April 2025: Sri Venkateswara Swamy mass Vratham was organized under the auspices of the Hindu Dharma Prachara Parishad wing of Tirumala Tirupati Devasthanams, on Sunday at the TTD Kalyana Mandapam in MVP Colony of Visakhapatnam. 

About 1000 devotees participated in this program with a great devotion.

This vratham was successfully organized with the support of the District Religious Committee and donors. 

The devotees were provided with free puja materials by the TTD. Additionally, two types of prasadams were distributed to the devotees.  As part of this program, cultural programs like Kuchipudi, Bharatanatyam, and Sankeertana were also organized which were impressive.

Later Veda parayanam was also conducted and Vedaseervachanam was also given to the devotees.

The members of the District Religious Committee, members of Annamayya Seva Samstha, various spiritual and cultural organizations, Srivari Sevaks contributed a lot in the success of the program.

Cluster Superintendent Sri M. Kantikumar, District Program Assistant Sri Ch. Satyanarayana participated in the program besides the members of the District Religious Committee.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

విశాఖపట్నంలో వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి సామూహిక వ్రతం

– హెచ్ డిపిపి ఆధ్వర్యంలో పాల్గొన్న వెయ్యి మంది భక్తులు

తిరుప‌తి, 2025 ఏప్రిల్ 13: టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం విశాఖపట్నంలో శ్రీ వేంకటేశ్వర స్వామి సామూహిక వ్రతం ఘనంగా జరిగింది.

విశాఖపట్నం ఎంవిపి కాలనీలోని టిటిడి కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ వేంకటేశ్వర స్వామి సామూహిక వ్రతం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా సుమారు 1000 మంది భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

ఈ వ్రతాన్ని జిల్లా ధార్మిక కమిటీ మరియు దాతల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు.

భక్తులకు టిటిడి ద్వారా ఉచితంగా పూజా సామగ్రి, రెండు రకాల ప్రసాదాలు భక్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కూచిపూడి, భరతనాట్యం, సంకీర్తనల వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ శ్రీనివాస వ్రతం విశాఖ నగర ప్రజల ఆధ్యాత్మిక చైతన్యాన్ని మరింత పెంపొందించింది. టిటిడి వేద పండితులు వేద పారాయణం నిర్వహించారు. భక్తులకు వేదాశీర్వచనాలు ఇచ్చారు.

కార్యక్రమ విజయవంతానికి జిల్లా ధార్మిక కమిటీ సభ్యులు, అన్నమయ్య సేవా సంస్థ సభ్యులు, వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంస్థలు మరియు సభ్యులు, శ్రీవారి సేవకులు తనవంతు సేవ అందించి ఎంతో సహకరించారు.

కార్యక్రమంలో క్లస్టర్ సూపరింటెండెంట్ శ్రీ కాంతికుమార్, జిల్లా ప్రోగ్రామ్ అసిస్టెంట్ శ్రీ సత్యనారాయణ, జిల్లా ధార్మిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.