MAHA KUMBHABHISHEKAM PERFORMED WITH RELIGIOUS FERVOUR IN VISAKHA SRIVARI TEMPLE _ విశాఖ‌లో వైభవంగా శ్రీవారి ఆలయ మహాకుంభాభిషేకం – శాస్త్రోక్తంగా వైదిక క్రతువులు

VAIKHANASA RITUALS PERFORMED

 

Visakhapatnam, 23 Mar. 22: The series of rituals in the newly constructed Sri Venkateswara Swamy temple in Visakhapatnam was observed as per the tenets of Vaikhanasa Agama on Wednesday in the auspicious Vrishabha Laganam between 9.50am and 10.20am.

 

The day began with Suprabhatam, Kumbharadhaana, Nivedana, Homam, Maha Purnahuti between 5.30am and 8am. This was followed by various other rituals including the procession of utsava murthies between 9am and 11:30am. Later Brahmaghosha, Veda Sattumora, Dhwajarohanam, Archaka Bahumanam followed. Nitya Kainkaryama were performed between 12noon and 1.3pm.  

 

In the evening, Srinivasa Kalyanam was performed between 4pm and 5.30pm and after series of evening rituals, the Ekanta Seva will be observed by 9pm in the temple.

  

DARSHAN FOR DEVOTEES FROM MARCH 24 ONWARDS

 

The darshan for devotees in the newly constructed Sri Padmavathi Godadevi Sameta Sri Venkateswara Swamy temple which opened in Visakhapatnam on Wednesday will commence from Thursday, March 24 onwards. 

 

During the Maha Kumbhabhishekam fete which was performed on Wednesday, HH Sri Swarupananda Saraswathi Swamy of Visakha Sarada Peetham, Jr.Pontiff Sri Swatmananda Saraswathi Swamy, AP Minister Sri Avanti Srinivas, TTD Chairman Sri YV Subba Reddy, Board Members Sri P Ashok Kumar, Sri Malladi Krishna Rao, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Gopinath Jatti, Visakha Collector Sri Mallikarjuna Rao, SVBC CEO Sri Suresh Kumar, CE Sri Nageswara Rao, SE Electrical Sri Venkateswarulu, DyEO Sri Ramana Prasad, VGO Sri Manohar were present.

 

The religious staff included Srivari temple Chief Priest Sri Venugopala Deekshitulu, Sri Kiran Deekshitulu, SV Higher Vedic Studies Project officer Dr Vibhishana Sharma and Agama Advisor Dr Vedantam Vishnubhattacharyulu.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

విశాఖ‌లో వైభవంగా శ్రీవారి ఆలయ మహాకుంభాభిషేకం

– శాస్త్రోక్తంగా వైదిక క్రతువులు

విశాఖ‌లో, 2022 మార్చి 23: విశాఖ‌లో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం ఉదయం 9.50 నుండి 10.20 గంటల నడుమ వృష‌భ‌ లగ్నంలో శాస్త్రోక్తంగా మహాకుంభాభిషేకం జరిగింది.

ఉద‌యం 5.30 నుండి 8 గంటల వరకు సుప్రభాతం, కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 9 నుండి 11.30 గంటల వరకు కుంభాలను, ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆయా సన్నిధుల్లోకి వేంచేపు చేశారు. ఉదయం 9.50 నుండి 10.20 గంటల మధ్య వృష‌భ‌ లగ్నంలో ఆగమోక్తంగా మహాకుంభాభిషేకం నిర్వ‌హించారు. ఆ తరువాత  బ్రహ్మఘోష, వేదశాత్తుమొర, ధ్వజారోహణం, అర్చక బహుమానం జ‌రిగింది. వేద పండితులు, అర్చకుల  పూజల అనంతరం విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానంద  సరస్వతి ఆలయ ఉత్తర ద్వార ఉద్ఘాటనం చేశారు.మ‌ధ్యాహ్నం 12 నుండి 1.30 గంట‌ల వ‌ర‌కు నిత్య కైంక‌ర్యాలు నిర్వ‌హించారు. 
 
కాగా, సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం, సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఉత్సవమూర్తుల ఊరేగింపు, ధ్వజావరోహణం, సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు నిత్య కైంకర్యాలు, రాత్రి 9 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తారు.
 
గురువారం నుంచి భక్తులకు స్వామివారి దర్శనం విశాఖలో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ మహాకుంభాభిషేకం ముగిసిన నేపథ్యంలో గురువారం నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
 
ఈ కార్యక్రమంలో విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మా నందేంద్ర సరస్వతి,  టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి దంప‌తులు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్, బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, శ్రీ మల్లాడి కృష్ణా రావు, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, విశాఖ జిల్లా కలెక్టర్ శ్రీ మల్లిఖార్జున, ఎస్వీ బీ సి  సిఈఓ  శ్రీ సురేష్ కుమార్, టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు,  శ్రీ కిరణ్ దీక్షితులు, ఆగమ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు, ఎస్వీ వేదాధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి శ్రీ  ఆకెళ్ల విభీషణ శర్మ, ఎస్ఇ ఎలక్ట్రికల్ శ్రీ వెంకటేశ్వర్లు, డెప్యూటీ ఈఓ డా.రమణప్రసాద్, విజిఓ శ్రీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.