విషయం :- ”జి.ఎం. కోసం సర్వీస్ నిబంధనల మార్పు?” టి.టి.డి లో ఇదో మతలబు” అనే శీర్షిక సాక్షిలో 3-7-08 వ తేదిన ప్రచురించిన వార్తకు వివరణ…………..
తిరుమల తిరుపతి దేవస్థానములు
వివరణ
విషయం :- ”జి.ఎం. కోసం సర్వీస్ నిబంధనల మార్పు?” టి.టి.డి లో ఇదో మతలబు” అనే శీర్షిక సాక్షిలో 3-7-08 వ తేదిన ప్రచురించిన వార్తకు వివరణ…………..
తిరుపతి దేవస్థానములో జనరల్ మేనేజరు పోస్టును రిక్రూట్ చేసుకోవడానికి మార్చినెల 27వ తేదిన పత్రికలలో ఒక ప్రకటన విడుదల చేశామని తి.తి.దే., సర్వీసెస్ స్పెషల్ గ్రేడు డిప్టూటీ ఎక్జిక్యూటివ్ అధికారి శ్రీ టి.ఎ.పి.నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకటన ఆధారంగా పదకొండుమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, రీజినల్ ఎంప్లాయ్‌మెంటు అధికారి మరో ఇరవైమంది అభ్యర్థుల పేర్లు పంపించారని ఆయన తెలిపారు. ఎంప్లాయ్‌మెంటు అధికారి ద్వారా వచ్చిన అభ్యర్థులను మే 5వ తేదిలోపల పూర్తి వివరాలతో దరఖాస్తులు పంపమని కోరామని, కాని వారెవరూ దరఖాస్తులు పంపలేదని ఆయన తెలిపారు
అంతేగాకుండ, సర్వీసు నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న పదకొండుమంది అభ్యర్థులకు కూడా అర్హత లేదని ఆయన తెలిపారు. డిప్యుటేషన్ తి.తి.దే.,లో జనరల్ మేనేజరుగా పనిచేస్తున్న శ్రీ పి.వి.శేషారెడ్డి యీ పోస్టుకు తన దరఖాస్తును అందజేశారని, కాని నిబంధనల ప్రకారం పేర్కొన్న వయసు కంటె ఎక్కువ యుంది కాబట్టి ఆయనకు కూడా అర్హత లేదని ఆయన తెలిపారు.
మీ పత్రికలో ఆరోపించిన విధంగా, ఏ ఒక్క అభ్యర్థికీ లబ్ధి చేకూర్చడానికి నిబంధనలు మార్చడానికి ప్రయత్నం జరుగలేదని ఆయన తెలిపారు. కాబట్టి మీరు ప్రచురించిన వార్త సత్యదూరం.
ఈ వివరణను ప్రముఖంగా ప్రచురించాలని మనవి.
కె.రామపుల్లారెడ్డి,
ప్రజాసంబంధాల అధికారి,