WOMANHOOD EXEMPLARY IN VENGAMBA WRITINGS- SPEAKERS _ వెంగమాంబ రచనల్లో స్త్రీ హృదయం కనిపిస్తుంది : ఆచార్య సర్వోత్తమరావు
వెంగమాంబ రచనల్లో స్త్రీ హృదయం కనిపిస్తుంది : ఆచార్య సర్వోత్తమరావు
తరిగొండ వెంగమాంబ 206వ వర్ధంతి ఉత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2023 ఆగస్టు 24: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ తన రచనల్లో భాష, భావం, భావ వ్యక్తీకరణలో స్త్రీ హృదయాన్ని ఆవిష్కరించారని ఎస్వీ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు సర్వోత్తమరావు తెలిపారు. శ్రీవారి అపర భక్తురాలైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 206వ వర్ధంతి ఉత్సవాలు గురువారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా జరిగిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య సర్వోత్తమరావు ” వేంకటాచల మహాత్యం లక్ష్మీదేవి ” అనే అంశంపై ప్రసంగిస్తూ, వెంగమాంబ తెలుగులో రచించిన వేంకటాచల మహాత్యం చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పారు. తెలుగులో కవయిత్రులు చాలా తక్కువన్నారు. వెంగమాంబ భక్తి రచనల్లో సంసారిక చిత్రాలకు సంబంధించి లక్ష్మీదేవి భర్తను అనుసరించడం, సేవించడం, కల్యాణం, తిరుమల కొండలు తదితర అంశాలతో పాటు అనాటి సామాజిక అంశాలను వివరించారని చెప్పారు.
తిరుపతికి చెందిన విశ్రాంత ఆచార్యులు డా.కృష్ణారెడ్డి ”మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విజయం ” అనే అంశంపై మాట్లాడుతూ, వెంగమాంబ తన జీవితాన్ని స్వామివారి కైంకర్యానికి అంకితం చేశారని తెలిపారు.
మానవ జీవిత లక్ష్యం పరమాత్మ సాక్షాత్కారమని, అన్నమయ్య కీర్తనల ద్వారా స్వామివారిని ఆరాధించగా, వెంగమాంగ గద్యం, పద్యం, యక్షగానాల రచన ద్వారా భక్తిని చాటుకున్నారని చెప్పారు. దైర్య సాహసాలలో పురుషుల కంటే మహిళలు ఎక్కువ అని తన రచనల ద్వారా నిరూపించారని తెలిపారు.
చంద్రగిరికిి చెందిన డా|| సంగీతం కేశవులు ”తరిగొండ వెంగమాంబ సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి వర్ణనలు – విశిష్టత ” అనే అంశంపై ప్రసంగిస్తూ, ఆమె వివిధ సాహిత్య ప్రక్రియలలో 18 గ్రంథాలను రచించిన మొదటి తెలుగు కవయిత్రి అని తెలిపారు. రచనలలో సకల సిద్ధాంతాలను ఆకళింపు చేసుకుని తాత్వికతను లోకానికి అందించినట్లు చెప్పారు.
అంతకుముందు శ్రీవారు, తరిగొండ వెంగమాంబ చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి సుశీల, డా.శ్యాం కుమార్ భక్తి సంగీత సభ నిర్వహించారు. అనంతరం సాహితీ సదస్సులో పాల్గొన్న పండితులను శాలువ, శ్రీవారి ప్రసాదాలతో సన్మానించారు.
సాయంత్రం 6 గంటలకు తిరుపతికి చెందిన శ్రీమతి లావణ్య, కుమారి లక్ష్మీరాజ్యం బృందం సంగీత సభ జరుగనుంది.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఆస్థాన విధ్వంసులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్,
ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డా.లత, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Tirupati, 24 August 2023: Retired Professor and scholar Sri Sarvottam Rao said saint poetess Vengamba personified womanhood in her writings.
Presiding over the Vengamba 206th Vardhanti fete held at Annamacharya Kalamandiram in Tirupati on Thursday he lauded the ardent devotee of Sri Venkateswara’s Telugu literary works including Venkatachala Mahatyam and it’s influence on the society.
Among others retired lecturers Dr Krishna Reddy, Dr Sangeetam Keshavulu also spoke at the Sahiti Sadassu organised as part of the fete by TTD.
Earlier special puja was performed for a portrait of Matrusri Tarigonda Vengamamba and artists of the Annamacharya Project rendered bhakti sangeet penned by the saint poetess. All pandits were felicitated with a shawl and srivari prasadam.
TTD Astana Vidwan Sri Garimella Balkrishna Prasad, program coordinator Dr Lata and others were also present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI