TTD EO RELEASES SRINIVASA KALYANAM WALL POSTER _ వేంకట పాలెంలో శ్రీనివాస కళ్యాణోత్సవం వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన టిటిడి ఈవో

Tirumala, 07 March 2025: TTD EO Sri J Syamala Rao along with TTD and Guntur district officials released the wall poster for the Srinivasa Kalyanam to be held on March 15 at the temple premises of Sri Venkateswara Swamy, Venkata Palem under the auspices of Tirumala Tirupati Devasthanam. 

Speaking on the occasion, the EO said that a wide campaign is being conducted in the surrounding areas of Amaravati regarding Srinivasa Kalyanam.  Cultural programs will be organized under the auspices of Hindu Dharma Prachara Parishad and Annamacharya Projects of TTD.  

He said that this is an unprecedented opportunity for the devotees who could not witness the divine marriage ceremony of Srivaru in Tirumala.  

Devotees in the surrounding areas of Amaravati are requested to watch the Srinivasa Kalyanam to be held at Venkata Palem and beget the divine blessings.  

Guntur District Collector Ms. Nagalakshmi, District SP Sri S Satish Kumar, TTD JEO Sri V Veerabraham, TTD CE Sri Satyanarayana and other officials participated in this program. 

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వేంకట పాలెంలో శ్రీనివాస కళ్యాణోత్సవం వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన టిటిడి ఈవో

తిరుమల/ వేంకట పాలెం 2025, మార్చి 07: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 15న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం, వేంకట పాలెంలో జరుగనున్న శ్రీనివాస కల్యాణోత్సవంకు సంబంధించిన వాల్ పోస్టర్ ను టిటిడి ఈవో శ్రీ జె శ్యామల రావు టిటిడి మరియు గుంటూరు జిల్లా అధికారులతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు.

వేంకట పాలెంలో జరుగనున్న శ్రీనివాస కళ్యాణోత్సవంకు సంబంధించి అమరావతి పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తిరుమలలో శ్రీవారి కళ్యాణాన్ని వీక్షించలేని భక్తులకు ఇది అపూర్వమైన అవకాశం అని మాట్లాడారు. అమరావతి పరిసర ప్రాంతాల్లోని భక్తులు వేంకట పాలెంలో జరుగనున్న శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని వీక్షించి స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ సర్వశ్రీ నాగలక్ష్మీ, జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్, టిటిడి జేఈవో శ్రీ వి వీరబ్రహ్మం, టిటిడి సిఈ శ్రీ సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.