PADMAVATI PARINAYAM ENTERS DAY 2 _ అశ్వవాహనంపై వరునిగా అలరించిన శ్రీనివాసుడు

TIRUMALA, 07 MAY 2025: The three day annual Padmavati Parinayam entered the second day on Wednesday evening at Tirumala.

Sri Malayappa reached the wedding venue on Aswa Vahanam on the second day while Sridevi and Bhudevi on separate Tiruchis.

The tastefully decorated Parinaya Mandapam hosted the celestial wedding ceremony on Suddha Dasami Tithi, the actual day of the divine wedding of the deities as per Puranas.

After a series of traditional events like Chaturveda Paarayanam-Raga-Tala-

Sangeeta-Harikatha programs, in the presence of the finely decked Utsava murthies, 

the celestial wedding ceremony was observed in a grand manner in the pleasant evening amidst gentle showers.

Additional EO Sri Ch Venkaiah Chowdary, other officials, and devotees were present.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

అశ్వవాహనంపై వరునిగా అలరించిన శ్రీనివాసుడు

వైభవోపేతంగా రెండో రోజు పద్మావతి పరిణయోత్సవం

తిరుమల, 2025 మే 07 2025: తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో జరుగుతున్న శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు రెండో రోజు వైభవంగా జరిగాయి.

శ్రీ పద్మావతీ శ్రీనివాసుల పరిణయోత్సవ మహోత్సవంలో రెండవ రోజైన వైశాఖశుద్ధ దశమి తిథి అలనాటి వివాహ సుముహూర్త దినమని పురాణ ప్రశస్తి.

కనుక ఈ మూడు రోజుల పద్మావతీ పరిణయోత్సవంలో రెండవ రోజుకు ప్రత్యేకత ఉంది.

బుధవారం సాయంత్రం శ్రీ మాలయప్ప స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరి, వెంట వేరు వేరు బంగారు తిరుచ్చీలపై శ్రీదేవి మరియు భూదేవి అనుసరించగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు.

మొదటిరోజు మాదిరే శ్రీ స్వామివారికి అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలబంతులాట, నూతన వస్త్రధారణ తదితర కార్యక్రమాలు పూర్తయిన తరువాత కొలువు జరిగింది. ఈ కొలువులో చతుర్వేద పారాయణం అనంతరం, అమృత వర్షిణి, హిందూస్థాని,ఆనంద భైరవి, కళ్యాణి, దర్బార్ రాగాలలో వాయిద్య విన్యాసాలు, శ్రీ పద్మావతి శ్రీనివాస దివ్య వివాహ ఘట్ట హరికథా పారాయణం, అన్నమాచార్య సంకీర్తన వైభవం ఇత్యాది కార్యక్రమాలు రసరమ్యంగా నిర్వహించారు.

ఆ తరువాత శ్రీవారు దేవేరులతో పల్లకినెక్కి తిరువీధులగుండా ఊరేగుతూ ఆలయలోకి ప్రవేశం చేశారు.

ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.