RATHOTSAVAM HELD AT JUBILEE HILLS SV TEMPLE _ వేడుకగా శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి రథోత్సవం

Hyderabad / Tirupati, March 05, 2025 As part of the Ongoing annual Brahmotsavam of Sri Venkateswara Swamy temple at Hyderabad Jubilee Hills, Sri Kalyana Venkateswara Swamy, along with Sridevi and Bhudevi, ascended the chariot and gave darshan to the devotees on Wednesday morning.

Devotees offered camphor aartis at every step. The throngs of devotees were mesmerized by the kolatas, wood bhajans, sankeertans. The legend says that the Darshan of Swamy in the chariot will be free from the sorrows of their birth and attain salvation. 

At 7 pm, the Lord will give darshan to the devotees on the Aswa  Vahana

Temple AEO Sri Ramesh, temple priests and other officials and large number of devotees were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వేడుకగా శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి రథోత్సవం

హైద‌రాబాద్ / తిరుపతి, 2025 మార్చి 05: హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారు ర‌థాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు.

భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి.

శ్రీ‌వారి రథాన్ని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది. రథస్తుడైన మాధవుడిని దర్శిస్తే పునర్జన్మ ఉండదని అర్చ‌కులు తెలిపారు.

రాత్రి 7 గంటలకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ఏఈవో శ్రీ ర‌మేష్‌, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.