LORD SRI RAMACHANDRA BLESSES DEVOTEES IN VENUGANA ALANKARAM _ వేణుగానాలంకారంలోశ్రీరామచంద్రమూర్తిఅభయం
Vontimitta / Tirupati, March 28, 2026: As part of the annual Brahmotsavams at the Vontimitta Sri Kodandarama Swamy Temple, on the second day (Saturday morning), the Lord appeared in the beautiful Venugana Alankaram and blessed devotees along the four Mada streets of the temple.
The grand procession commenced at 7:30 a.m. Devotional groups accompanied the procession with traditional chekka bhajans and kolatam, singing praises of the Lord. Amidst the auspicious sounds of mangala vadyams, the procession was carried out in a festive and vibrant atmosphere. Devotees offered karpoora harati at every step and had darshan of the Lord.
At 11:00 a.m., Snapana Tirumanjanam was performed ceremoniously in the temple. The deities were offered sacred ablutions with milk, curd, honey, and sandal paste.
Deputy EO Smt. Prashanti, Temple Superintendent Sri Hanumanthaiah, Temple Inspector Naveen, temple priests, and a large number of devotees participated in the programme.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వేణుగానాలంకారంలో శ్రీ రామచంద్రమూర్తి అభయం
ఒంటిమిట్ట/తిరుపతి 2026 మార్చి 28: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉదయం వేణుగానాలంకారంలో స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.
ఉదయం 7.30 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఉదయం 11 గంటలకు ఆలయంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, ఆలయ సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, ఆలయ ఇన్స్పెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.









