DISTRIBUTION OF CLOTHES TO VEDIC STUDENTS _ వేద విద్యార్థులకు వస్త్రాలు పంపిణీ
Tirumala, 14 November 2025: TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary distributed clothes to the students pursuing Vedic education at the Veda Vigyanam Peetham located at Dharmagiri in Tirumala on Friday.
As part of the annual tradition, TTD distributes clothes to the students of the Veda Pathashala every year.
Continuing this practice the Additional EO distributed four dhotis and one blanket each to 380 students.
DyEO Sri Lokanatham, Principal of Veda Vigyanam Peetham Sri KSS Avadhani, Vedic scholars, and other officials participated in the programme.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
వేద విద్యార్థులకు వస్త్రాలు పంపిణీ
తిరుమల, 2025 నవంబర్ 14: తిరుమలలోని ధర్మగిరిలో ఉన్న వేద విజ్ఞానం పీఠంలో వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి శుక్రవారం వస్త్రాలను పంపిణీ చేశారు.
సంవత్సరానికోసారి వేద పాఠశాలలోని విద్యార్థులకు టీటీడీ వస్త్రాలు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా 4 పంచెలు, ఒక దుప్పటి చొప్పున 380 మంది విద్యార్థులకు అదనపు ఈవో పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ శివ సుబ్రహ్మణ్య అవధాని, వేద పండితులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.




