ADDITIONAL EO INSPECTS VQC COMPARTMENTS _ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లను తనిఖీ చేసిన టీటీడీ అదనపు ఈవో

TIRUMALA, 27 JULY 2024: After assuming charges at the Additional EO of TTD Sri Ch Venkaiah Chowdhary along with a team of officials concerned, inspected several places in Tirumala on Saturday evening.

In his maiden inspection, the Additional EO first visited Narayanagiri Sheds followed by the compartments in Vaikuntham Queue Complex 1 and 2 to understand the various types of darshans being provided to the pilgrims. And also the operation of queue lines including Rs.300, SSD, free darshan, Supadham entry, third line near Tirumala Nambi and other points.

He also personally verified the photo scanning process in the SSD counters and the luggage delivery system. Later in the compartments he inspected the washrooms and instructed the concerned to keep them clean. He also monitored the distribution of milk by Srivari Sevaks to the pilgrims in the compartments of Vaikuntham 1, 2 and also appreciated the services of Srivari Sevaks. 

The Additional EO inspected the Vaikuntham dispensary and interacted with the patient undergoing treatment and also inquired about the medication. The patient replied that his ailment was immediately attended to by the duty doctor and the medical services are satisfactory.

SE 2 Sri Jagadeeshwar Reddy, Temple DyEO Sri Lokanatham, DyEOs Sri Harindranath, Smt Vijayalakshmi, VGO Sri Nandakishore and other officials were present. 

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లను తనిఖీ చేసిన టీటీడీ అదనపు ఈవో

తిరుమల, 2024 జూలై 27: తిరుమలలోని పలు క్యూ లైన్లను, నారాయణగిరి షెడ్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లను శనివారం సాయంత్రం ఆదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన నారాయణగిరి ఉద్యానవనాల్లోని భక్తులు వేచి ఉండే షెడ్లు, క్యూలైన్లు, లగేజీ, మొబైల్ డిపాజిట్ కౌంటర్లు, ప్రధమ చికిత్స కేంద్రాలను తనిఖీ చేశారు.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని స్కానింగ్ సెంటర్, భక్తులకు అందుతున్న అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, పారిశుద్ధ్యం, తదితర సౌకర్యాలను పరిశీలించారు. కంపార్ట్మెంటులో పారిశుద్ధ్యం మరింత మెరుగ్గా ఉండాలని సూచించారు.

అనంతరం కంపార్ట్మెంట్ లలో శ్రీవారి సేవకులు భక్తులకు అందిస్తున్న పాలను పరిశీలించారు. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసి భక్తులకు వారందిస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు.

అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్- 1, తిరుమల నంబి ఆలయం, ఆలయ పరిసరాలను పరిశీలించి దర్శనం క్యూ లైన్లను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అదనపు ఈవో వెంట ఎస్ ఈ- 2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, విజిఓ శ్రీ నందకిషోర్, ఇతర అధికారులు ఉన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.