EO REVIEWS VAIKUNTHADWARA DARSHAN ARRANGEMENTS _ వైకుంఠద్వార దర్శన ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్ష

Tirumala,20 November 2023: TTD EO Sri AV Dharma Reddy reviewed the arrangements for the successful conduct of Vaikuntadwara Darshan to devotees on the occasion of Vaikunta Ekadasi day on December 23 onwards.

 

Addressing a review meeting at the Annamaiah Bhavan on Monday in Tirumala, the EO said all department officials and staff should gear up and ensure that the common devotees are not put to any hardships who come for Vaikuntadwara Darshan.

 

He directed that the TTD security and vigilance should coordinate with the district police to regulate crowds at all regions of Tirumala and at nine locations in Tirupati where Sarva Darshan token counters will be set up.

 

He said for ten days of Vaikuntadwara Darshan the privileged darshans like senior citizens, parents with infants physically challenged persons, NRIs and defence personnel were all cancelled along, with VIP break Darshan recommendations except the protocol darshan.

 

He said to avoid long waiting in queue lines time slot tokens are being issued. As a part of the scheme 2.25 lakh 300 Special Entry Darshan tickets were released online on November 10 itself. At Tirupati, from December 22 onwards 4, 23,500 Sarva Darshan time slot tokens will be issued for ten days. Every day seven lakh laddu stocks will be retained.

 

At Tarigonda Vengamamba Anna Prasadam Complex distribution of Annaprasadam will commence at 6 am and continue till 12 midnight. 

 

 

Among others he directed officials that at Kalyanakatta an adequate number of barbers be deployed,  flowers and electrical decorations at Srivari temple and other major junctions of Tirumala to be carried out and an adequate number of Srivari Sevaks also to be roped in for the convenience of devotees during Ten days of Vaikuntadwara Darshan.

 

JEOs Smt Sada Bhargavi and Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, Chief Engineer Sri Nageswar Rao,. SE-2 Sri Jagadeeshwar Reddy, Tirumala temple DyEO  Sri Lokanatham and other officials were present.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైకుంఠద్వార దర్శన ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్ష

తిరుమల, 2023 న‌వంబ‌రు 20: వైకుంఠ ఏకాదశి ప‌ర్వ‌దినం సందర్భంగా డిసెంబర్ 23 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు పది రోజులపాటు భక్తులకు కల్పించనున్న వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి సోమ‌వారం తిరుమల అన్నమయ్య భవనంలో సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం వచ్చే సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల్లో సిబ్బంది అప్రమత్తంగా పనిచేసేలా అధికారులు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. నిఘా, భద్రత అధికారులు పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాలతో పాటు, తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో ఏర్పాటుచేయ‌నున్న‌ సర్వదర్శనం కౌంటర్ల వద్ద భద్రత, భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చంటి పిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐ, రక్షణ సిబ్బందికి ప్రత్యేక దర్శనాలను ఈ పది రోజులపాటు రద్దు చేసినట్లు తెలిపారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు మినహా ఇతరుల నుండి ఈ పది రోజులపాటు వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని వెల్లడించారు.

భక్తులు క్యూ లైన్ల‌లో ఎక్కువ సమయం వేచి ఉండడాన్ని నివారించేందుకు భక్తులకు టైంస్లాట్ టోకెన్లు జారీ చేస్తున్నామ‌ని తెలియజేశారు. ఇందులో భాగంగా 2.25 లక్షల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు నవంబరు 10న విడుదల చేశామన్నారు. తిరుపతిలోని సర్వదర్శనం కౌంటర్లలో డిసెంబ‌రు 22 నుండి మొత్తం 4,23,500 టోకెన్లు మంజూరు చేస్తామ‌ని తెలిపారు. భ‌క్తుల కోసం రోజుకు 7 ల‌క్ష‌ల ల‌డ్డూలు అందుబాటులో ఉంచుకోవాల‌న్నారు. త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద కేంద్రంలో ఉద‌యం 6 నుండి అర్ధ‌రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు అన్నప్ర‌సాదాలు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపారు. క‌ల్యాణ‌క‌ట్ట‌ల్లో త‌గినంత‌మంది క్షుర‌కుల‌ను అందుబాటులో ఉంచుకోవాల‌న్నారు. శ్రీ‌వారి ఆల‌యం, ఇత‌ర ప్రాంతాల్లో ఆక‌ట్టుకునేలా పుష్పాలంక‌ర‌ణ‌, విద్యుద్దీపాలంక‌ర‌ణ చేప‌ట్టాల‌న్నారు. భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు త‌గినంత‌మంది శ్రీ‌వారి సేవ‌కుల‌ను ఆహ్వానించాల‌ని సూచించారు.

ఈ సమీక్షలో టీటీడీ జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, చీఫ్ ఇంజనీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.