CHAKRASNANAM PERFORMED IN ALL LOCAL SHRINES _ వైకుంఠ ద్వాద‌శి సంద‌ర్భంగా టిటిడి స్థానిక ఆలయాల్లో వైభ‌వంగా చ‌క్ర‌స్నానం

Tirupati, 7 January 2020: The Chakrasnana Mahotsavam was performed in all local temples of TTD following the auspicious occasion of Vaikuntha Dwadasi on Tuesday. 

This celestial fete is performed in the temple tanks of the respective temples at Tiruchanoor,  Appalayagunta and Srinivasa Mangapuram between 9am and 10am. 

Devotees took part in large numbers in all the temples. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వైకుంఠ ద్వాద‌శి సంద‌ర్భంగా టిటిడి స్థానిక ఆలయాల్లో వైభ‌వంగా చ‌క్ర‌స్నానం
         
 తిరుప‌తి, 07 జ‌న‌వ‌రి 2020: వైకుంఠ ద్వాద‌శిని పురస్కరించుకుని మంగ‌ళ‌వారం టిటిడి స్థానిక ఆలయాలలో చ‌క్ర‌స్నానం వైభ‌వంగా జ‌రిగింది.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగ‌ళ‌వారం ఉదయం 7 నుండి 9 గంటల వరకు శ్రీసుదర్శన చక్రత్తాళ్వార్‌కు స్న‌ప‌న‌తిరుమంజనం జ‌రిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చంద‌నం, ప‌సుపు త‌దిత‌న సుగంధ‌ద్ర‌వ్యాల‌తో వేడుక‌గా అభిషేకం చేశారు. ఆ త‌రువాత అర్చ‌కులు ప‌ద్మ‌పుష్క‌రిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం చేప‌ట్టారు.

శ్రీనివాసమంగాపురంలో …

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో వైకుంఠ ద్వాదశి సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ఉద‌యం 4 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం  తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం  చేప‌ట్టారు. ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు చ‌క్ర‌స్నానం వైభ‌వంగా జ‌రిగింది.

అప్పలాయగుంటలో ….

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి సందర్భంగా మంగ‌ళ‌వారం ఉదయం 8 గంటలకు స్వామి, అమ్మవార్లను పుర‌వీధుల్లో ఊరేగించారు. ఉద‌యం 9 గంటలకు స్నపన తిరుమంజనం, ఉదయం 10 గంటలకు చక్రస్నానం వేడుక‌గా నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్రమాల్లో ఆయా ఆల‌యాల అధికారులు, అర్చ‌కులు, విశేషంగా భ‌క్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.