BUILDINGS UNDER CONSTRUCTION IN THE HOSPITAL SHOULD BE QUICKLY _ వైద్య సౌకర్యాలపై రోగులతో మాట్లాడిన టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు
TIRUPATI, 02 NOVEMBER 2024: TTD EO Sri J. Shyamala Rao has ordered the engineering officers to complete the Sri Balaji Institute of Oncology, Central Drug Store and other buildings under construction in the hospital quickly and make them accessible to patients. The EO, along with SWIMS Director Dr. R. V. Kumar, reviewed the medical facilities being provided to patients in various departments of SWIMS on Saturday evening.
In this, along with the main departments, the heads of departments like General Surgery, General Medicine, Neurology and others reviewed the treatments being done in their departments, the steps to be taken to provide better facilities and increase the number of patients. Later, they inspected the operation theaters on the third floor of the General Ward and Padmavati Hospital and made several suggestions.
Later, the doctors in the emergency department inquired about the medical services being provided to patients, other facilities, NTR Aarogyasri medical services, OP registration and other issues. The EO inspected the patient assistants’ room and spoke to the people waiting there about the food and medical facilities provided by TTD.
As part of this, the EO spoke to patients like Sri Doraswamy (heart operation) from V. Kota in Chittoor district, Sri Subbarao (hernia operation) from Jammalamadugu in Kadapa district, Sri Chakravarthy (hot operation) from Chittoor, Sri Sainath who underwent general surgery and inquired about the medical assistance being provided to them.
On this occasion, the patients and their assistants expressed their satisfaction with the quality of medical care and other facilities provided by TTD.
CE Sri Satyanarayana, SE Sri Manoharam, EEs Sri Prasad, Sri Mallikarjun, SWIMS Medical Superintendent Dr. Ram, RMO Dr. Kotireddy, Nursing Deputy Director Smt. Prabhavathi,
Many doctors and other officials participated in the program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
స్విమ్స్ ఆసుపత్రిలో నిర్మాణంలో ఉన్న భవనాలను వేగంగా పూర్తి చేయాలి
– వైద్య సౌకర్యాలపై రోగులతో మాట్లాడిన టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు
– టీటీడీ అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిన రోగులు
తిరుపతి, 2024 నవంబరు 02: స్విమ్స్ ఆసుపత్రిలో నిర్మాణంలో ఉన్న శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, సెంట్రల్ డ్రగ్ స్టోర్, ఇతర భవనాలను వేగవంతంగా పూర్తి చేసి రోగులకు అందుబాటులోనికి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు ఆదేశించారు. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ వి. కుమార్ తో కలిసి శనివారం సాయంత్రం స్విమ్స్‌లోని వివిధ విభాగాలలో రోగులకు అందుతున్న వైద్య సౌకర్యాలపై ఈవో సమీక్షించారు.
ఇందులో ప్రధానమైన విభాగాలతో పాటు, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, న్యూరాలజీ తదితర విభాగాధిపతులతో వారి వారి విభాగాలలో జరుగుతున్న చికిత్సలు, మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, రోగుల సంఖ్య పెంచేందుకు తీసుకోవలసిన చర్యలపై సమీక్షించారు. అనంతరం జనరల్ వార్డ్, పద్మావతి ఆసుపత్రిలోని మూడవ అంతస్తులోని ఆపరేషన్ థియేటర్లు పరిశీలించి పలు సూచనలు చేశారు.
తరువాత అత్యవసర చికిత్స విభాగంలో వైద్యులు రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, ఇతర సౌకర్యాలు, ఎన్ టిఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు, ఓపి రిజిస్ట్రేషన్ తదితర అంశాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగుల సహాయకుల గదిని పరిశీలించి అక్కడ వేచి ఉన్న వారితో టీటీడీ అందిస్తున్న భోజనం, వైద్య సౌకర్యాల గురించి ఈవో మాట్లాడి తెలుసుకున్నారు.
ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా వి.కోటకు చెందిన శ్రీ దొరస్వామి(గుండె ఆపరేషన్), కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన శ్రీ సుబ్బారావు ( హెర్నియా ఆపరేషన్), చిత్తూరుకు చెందిన శ్రీ చక్రవర్తి (హాట్ ఆపరేషన్), జనరల్ సర్జరీ చేయించుకున్న శ్రీ సాయినాథ్ తదితర రోగులతో ఈవో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రోగులు, వారి సహాయకులు టీటీడీ అందిస్తున్న నాణ్యమైన వైద్యం, ఇతర సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సిఈ శ్రీ సత్యనారాయణ, ఎస్ఈ శ్రీ మనోహరం, ఎస్ఈ ఎలక్ట్రికల్ శ్రీ వెంకటేశ్వర్లు, ఈఈలు శ్రీ ప్రసాద్, శ్రీ మల్లికార్జున్, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, ఆర్ఎంఓ డాక్టర్ కోటిరెడ్డి, నర్సింగ్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి ప్రభావతి,
పలువురు వైద్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.