GARLAND PROCESSION HELD _ వైభవంగా ఆండాళ్‌ అమ్మవారి మాలల ఊరేగింపు

GOLDEN CHARIOT ON FEB 23

Tirupati, 22 February 2025: Andal Ammavari garlands from Sri Govindaraja Swamy temple in procession reached Srinivasa Mangapuram on Saturday.

While groups of devotees performed chekkabhajans and kolatams, the garlands on Ambari reached the temple in a procession through the four Mada streets amidst mangal vaidyams.  

These Malas will be decorated for the Lord during the Garuda Seva held at night.

Tirumala Sri Sri Pedda Jeeyar Swamy, Sri Sri Chinna Jeeyar Swamy, Spl Gr Deputy EO smt . Varalakshmi and DyEO Smt Shanti participated in this program.

The Golden Chariot will be held in grandeur on Sunday, the sixth day of Sri Kalyana Venkateswara Swamy Brahmotsavam between 4pm and 5pm.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా ఆండాళ్‌ అమ్మవారి మాలల ఊరేగింపు

– ఫిబ్ర‌వ‌రి 23న స్వర్ణ రథోత్సవం

తిరుపతి, 2025 ఫిబ్రవరి 22: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శ‌నివారం రాత్రి 7 గంటలకు జరుగనున్న శ్రీవారి గరుడ సేవలో అలంకరించేందుకు ఉదయం శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి ఆండాళ్‌ అమ్మవారి మాలలను ఊరేగింపుగా తీసుకెళ్లారు.

గోదా కల్యాణయాత్ర పేరిట నిర్వహించిన ఈ యాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ యాత్ర శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఆలయం నుండి ఎస్వీ గోసంరక్షణశాల, తాటితోపు, పెరుమాళ్లపల్లి మీదుగా అంబారీపై మాలల ఊరేగింపు శ్రీనివాసమంగాపురానికి చేరుకుంది.

భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా అంబారీపై మాలలు ఆలయానికి చేరుకున్నాయి. రాత్రి జరిగే శ్రీవారి గరుడ సేవలో ఈ మాలలను స్వామివారికి అలంకరించనున్నారు.

ఈ కార్యక్రమంలో తిరుమ‌ల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవోలు శ్రీమతి వరలక్ష్మీ, శ్రీమతి శాంతి పాల్గొన్నారు.

ఫిబ్ర‌వ‌రి 23న స్వర్ణ రథోత్సవం

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజైన ఆదివారం స్వర్ణ రథోత్సవం వైభవంగా జరుగనుంది. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు స్వర్ణ రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు గజవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.