GRAND CELEBRATION OF SRI SITARAMA KALYANOTSAVAM AT VONTIMITTA _ వైభవంగా ఒంటిమిట్ట శ్రీసీతారాముల కళ్యాణోత్సవం
VONTIMITTA/TIRUPATI, 11 JUNE 2025: Sri Sitarama Kalyanotsavam was observed with grandeur on Wednesday at the Sri Kodanda Rama Swamy temple in Ontimitta, Kadapa district, an affiliated temple under the Tirumala Tirupati Devastanams, marking the auspicious occasion of Jyestha Pournami.
The festival deities of Sri Sita and Sri Rama were elegantly adorned with golden ornaments and colorful flowers and seated on a specially decorated platform within the temple premises.
The temple priests performed various traditional rituals, including Vishwaksena Puja, Kalasha Sthapana, Kalasha Puja, Vasudeva Punyavachanam, Kankana Puja and Dharana, Yajnopavita Puja and Dharana, offering of silk clothes and Madhuparkam, Kanyadanam, Mangala Puja, Mangalyadharana, exchange of garlands, Varanamayiram, Maha Nivedana, and Karpoora Harati.
Devotees from surrounding areas of Ontimitta gathered to witness the divine celestial wedding and had darshan of the deities. They also received Theertha and Prasadam. TTD officials and devotees actively participated in the event.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైభవంగా ఒంటిమిట్ట శ్రీసీతారాముల కళ్యాణోత్సవం
తిరుపతి/ ఒంటిమిట్ట, 2025, జూన్ 11: తిరుమల తిరుపతి దేవస్థానముల అనుబంధ ఆలయమైన కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో జ్యేష్ట మాసం పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది.
ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై సీతారాముల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి బంగారు ఆభరణాలు, వర్ణమైన పుష్పమాలతో అలంకరించారు. ముందుగా అర్చకులు విశ్వసేన పూజ, కలశ ప్రతిష్ట, కలశపూజ, వాసుదేవ పుణ్యా వచనం, కంకణ పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవీత పూజ, యజ్ఞోపవీత ధారణ, మధుపర్కం పట్టు వస్త్ర సమర్పణ, కన్యాదానం, మాంగల్య పూజ, మాంగల్య ధారణ, అక్షతరూపణ మాల మార్పిడి, వారణమయి మహా నివేదనం, కర్పూర హారతి కార్యక్రమాలను నిర్వహించారు. ఒంటిమిట్ట సమీప ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని చూశారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.