GRAND CHAKRASNANAM AT JUBILEE HILLS SV TEMPLE _ వైభవంగా జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి చక్రస్నానం
Hyderabad / Tirupati, March 06, 2025: The grand chakrasnanam of Lord Venkateswara Swamy at Jubilee Hills, Aswa part of the finale of the ongoing annual Brahmotsavam was held on Thursday morning.
From 5:30 to 7:30 in the morning, the utsava idols of Swami and Ammavarlu were taken out in a procession on Tiruchi and gave darshan to the devotees. Later, from 8 to 10 in the morning, a Snapana Thirumanjanam was performed for the Utsavars of Sri Venkateswara Swamy along with Sridevi Bhudevi after an Abhisekam
The Brahmotsavam will conclude with the Dwaiavarohanam flag un-hoisting ceremony in the evening.
Temple AEO Sri Ramesh, other officials and a large number of devotees participated in this program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైభవంగా జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి చక్రస్నానం
హైదరాబాద్ / తిరుపతి, 2025 మార్చి 06: జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం చక్రస్నానం వైభవంగా నిర్వహించారు.
ఉదయం 5:30 నుండి 7:30 గంటల వరకు స్వామి అమ్మవార్లు తిరుచ్చిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఉదయం 8 నుండి 10 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవర్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనలతో అభిషేకం చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణిలో సుదర్శన చక్రానికి స్నానం చేయించారు.
సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ రమేష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.