SRI AGASTHEESWARA SWAMY BRAHMOTSAVAM BEGIN GRANDLY _ ధ్వ‌జారోహ‌ణంతో వైభ‌వంగా ప్రారంభ‌మైన శ్రీ అగస్తీశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

TIRUPATHI, 01 MAY 2025: The annual Brahmotsavams of Sri Maragadavalli Sametha Agastheeswara Swamy Temple, an affiliate of the Sri Kalyana Venkateswara Swamy Temple in Narayana Vanam, was observed with grandeur on Thursday. 

The festivities began with the ceremonial Dhwajarohanam was conducted between 7.30 AM and 9 AM during the auspicious Vrishabha Lagnam. 

In the evening at 7.30 PM, Sri Agastheeswara Swamy will grace devotees atop the Chandraprabha Vahanam, marking the start of the vibrant vahanam processions. 

Daily rituals include Snapana Thirumanjanam between 10AM and 11 AM and Vahana Sevas at 7:30 PM.

Schedule:

May 2: Simha Vahanam.

May 3: Hamsa Vahanam.

May 4: Sesha Vahanam.

May 5: Nandi Vahanam.

May 6: Gaja Vahanam.

May 7: Rathotsavam.

May 8: Kalyanotsavam (7 PM, Rs.500 per ticket for two persons.  Includes uttariyam, blouse piece, laddu, appam, prasadam), followed by Ashwa Vahanam.

May 9: Nataraja Abhishekam-9 AM, Ravaneswara Vahanam -7 PM.

May 10: Trishula Snanam – 11 AM-12:30 PM, concluding with Dwajavarohanam – 7 PM.

TTD Hindu Dharma Prachara Parishad and Annamacharya Project will organize daily devotional cultural programs.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

ధ్వ‌జారోహ‌ణంతో వైభ‌వంగా ప్రారంభ‌మైన శ్రీ అగస్తీశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2025 మే 01: నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మరగదవల్లీ సమేత అగస్తీశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం ధ్వ‌జారోహ‌ణంతో వైభ‌వంగా ప్రారంభ‌మ‌య్యాయి.

ఇందులో భాగంగా ఉద‌యం 7.30 నుండి 9 గంటల మధ్య వృష‌భ‌ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారు. రాత్రి 7.30 గంటలకు చంద్రప్రభ వాహనంపై అగస్తీశ్వరస్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ప్రతిరోజూ ఉదయం 10 నుండి 11 గంటల మధ్య స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. ప్రతి రోజు రాత్రి 7.30 గంటలకు స్వామివారు వాహనసేవపై విహరించనున్నారు.

మే 2వ తేదీ సింహ వాహనం, మే 3న హంస వాహనం, మే 4న శేషవాహనం, మే 5న నంది వాహనం, మే 6న గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. మే 7న రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. మే 8న రాత్రి 7 గంటలకు కల్యాణోత్సవం, అనంతరం అశ్వవాహన సేవ జరుగనున్నాయి. రూ.500/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదాలను బహుమానంగా అందజేస్తారు.

మే 9న ఉదయం 9 గంటలకు శ్రీ నటరాజస్వామివారికి అభిషేకం, వీధి ఉత్సవం జరుగనుంది. రాత్రి 7 గంట‌ల‌కు రావణేశ్వర వాహనంపై అగస్తీశ్వరస్వామి దర్శనమిస్తారు. మే 10న ఉద‌యం 11 నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు కైలాసకోనలో త్రిశూలస్నానం ఘనంగా నిర్వహించనున్నారు. అదేరోజు రాత్రి 7 గంట‌ల‌కు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ కోలాటం, ఆధ్యాత్మిక, భక్తిసంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ఏఈవో శ్రీ ర‌వి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నాగరాజు, ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

ఆలయ చరిత్ర :

ఆలయ చరిత్రను పరిశీలిస్తే నారాయణవనం ప్రాంతాన్ని పరిపాలించిన శ్రీ పద్మావతీదేవి తండ్రి అయిన శ్రీ ఆకాశ మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ శ్రీ అగస్తీశ్వరస్వామివారు స్వయంభువుగా వెలిశారు. స్వామివారి లింగాకారానికి పీఠభాగం అనగా బాణపట్టమును అమర్చి వేద ఆగమశాస్త్ర ప్రకారం శ్రీ అగస్త్య మహర్షులవారు ప్రతిష్ఠ చేసి పూజించినందువల్ల స్వామివారికి అగస్తీశ్వరస్వామి అని పేరు వచ్చినట్లు తెలుస్తోంది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.