POURNAMI GARUDA SEVA HELD IN TIRUMALA _ వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
Tirumala, 10 September 2022: The monthly Pournami Garuda Seva was held in Tirumala on Saturday evening.
Sri Malayappa on Garuda vahanam blessed His devotees along four Mada streets between 7pm and 9pm.
TTD CVSO Sri Narasimha Kishore, VGO Sri Bali Reddy, Peishkar Sri Srihari were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
తిరుమల, 2022 సెప్టెంబరు 10: తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు.
గరుడ వాహనం – సర్వపాప ప్రాయశ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
ఈ కార్యక్రమంలో సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, విజివో శ్రీ బాలిరెడ్డి, పేష్కార్ శ్రీ శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.