SHOBHA YATRA COMMENCES _ వైభవంగా భజనమండళ్ల శోభాయాత్ర
Tirupati, 10 July 2023: As part of Traimasika Metlotsavam by Dasa Sahitya Project of TTD the Shobha Yatra commenced at Sri Govindaraja Swamy temple to IINC Chowltries on Monday evening.
Over 3500 bhajan members participated in the yatra from southern states and Maharastra.
Special Officer Sri Ananda Theerthacharyulu said Harinama Sankeertana is the ultimate devotional tool to attain salvation.
On July 12 Metlotsavam will be performed at Padala Mandapam in Alipiri footpath route by 4:30am.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైభవంగా భజనమండళ్ల శోభాయాత్ర
తిరుపతి, 2023 జూలై 10: టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం భజనమండళ్ల శోభాయాత్ర వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరుగనున్న శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ ప్రారంభంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
తిరుపతి రైల్వేస్టేషన్ వెనక వైపు గల మూడో సత్ర ప్రాంగణంలో ఉదయం 5 నుండి 7 గంటల వరకు భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 8.30 నుండి 10.30 గంటల వరకు సంకీర్తనాలాపన జరిగింది. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ధార్మిక సందేశం అందించారు.
సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వద్ద టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీఆనందతీర్థాచార్యులు పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీ ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ, హరినామసంకీర్తన ప్రజల్లో అశాంతిని దూరం చేస్తుందన్నారు. కలియుగంలో స్వామివారిని సేవించడం ఎంతో పుణ్యఫలమన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి విచ్చేసిన 3500 మందికిపైగా భజనమండళ్ల సభ్యులు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి శోభాయాత్రగా మూడో సత్రం ప్రాంగణానికి చేరుకున్నారు. దారి పొడవునా వారు చేసిన భజనలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి.
సాయంత్రం 6 గంటల నుండి సంగీత విభావరి,సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
జూలై 12న ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాలమండపం వద్ద ప్రముఖులతో మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని దర్శించుకుంటారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.