TEPPOTSAVAMS CONCLUDES _ వైభవంగా ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు
వైభవంగా ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు
– గరుడ వాహనంపై అమ్మవారు దర్శనం
తిరుపతి, 2022 జూన్ 14: తిరుచానూరులో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3.30 నుండి 5.00 గంటల వరకు నీరాడ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. అమ్మవారు ఏడు చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారు గరుడ వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ లోకనాధం, ఇఇ శ్రీ నరసింహమూర్తి, ఏఈఓ శ్రీ ప్రభాకర్ రెడ్డి, డెప్యూటీ ఇఇ శ్రీ సురేష్ బాబు, ఏఇ శ్రీ సురేష్ రెడ్డి, వాటర్ వర్క్స్ ఏఇ శ్రీ మురళీకృష్ణ, అర్చకులు శ్రీ బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ దామోదరం, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
TIRUPATI, 14 JUNE 2022: The annual Teppotsavams in Sri Padmavathi Ammavaru temple at Tiruchanoor concluded on Tuesday evening.
After Teppotsavams, Ammavaru blessed devotees on Garuda Vahanam.
DyEO Sri Lokanatham, EE Sri Narasimha Murty and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI