GRAND CELEBRATION OF SRI KALYANA VENKATESWARA SWAMY PARUVETA UTSAVAM _ వైభవంగా శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవం
Tirupati, 03 July 2025: The Paruveta Utsavam of Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram was observed near Srivari Mettu in a grand religious manner on Thursday.
Earlier the processional deities were taken from the temple in a ceremonial procession to the Paruveta Mandapam near Srivari Mettu.
Afterwards, the symbolic hunting festival was performed. As a part of this ritual, the deity symbolically launched arrows three times to signify the destruction of evil.
After the ceremonial Asthanam, the deities were brought back to the temple in the evening.
On this occasion, devotional songs were rendered by artists of TTD. Bhajan troupes performed devotional songs and Kolatam. Later, Anna Prasadam was distributed among the devotees.
The event was attended by Temple Spl Gr Deputy Executive Officer Smt. Varalakshmi, AEO Sri Gopinath, other officials, Srivari Sevaks, priests, and a large number of devotees.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైభవంగా శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవం
తిరుపతి, 2025, జూలై 03: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవాన్ని శ్రీవారి మెట్టు సమీపంలో గురువారం వైభవంగా నిర్వహించారు.
ఉదయం 11 గంటలకు ఆలయం నుంచి ఉత్సవమూర్తుల ఊరేగింపు శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపానికి చేరుకుంది. అక్కడ క్షేమతలిగ నివేదన చేసి పార్వేట ఉత్సవం నిర్వహించారు. ఇందులో దుష్టశిక్షణ కోసం స్వామివారు మూడు సార్లు బళ్లెంను ప్రయోగించారు. ఆస్థానం అనంతరం సాయంత్రానికి స్వామివారి ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తీసుకువస్తారు .
ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు. భజన బృందాలు భజనలు, కోలాటాలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈఓ శ్రీ గోపినాథ్, తదితర అధికారులు, శ్రీవారి సేవకులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.