NAMA SANKIRTHANA GIVES SALVATION IN KALI YUGA: BOARD MEMBER _ కలియుగంలో నామ సంకీర్తన మోక్ష ప్రదాయని : టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి
– GRAND METLA PUJA AT ALIPERI PADALA MANDAPAM
Tirumala, 12 February 2025: TTD Trust Board member, Sri Bhanuprakash Reddy, the Traimasika Metlotsavam is a great program that focuses the importance of attaining salvation through Nama Sankeertana in the Kali Yuga.
The Metlotsavam took place at Alipiri Padala Mandapam on Wednesday under the auspices of the Dasa Sahitya Project of TTD headed by Special Officer Mr P.R. Ananda Theerthacharyulu during the wee hours of Wednesday.
Around 3,500 members of Bhajan Mandals from Andhra, Telangana, Karnataka and Tamil Nadu participated in this program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కలియుగంలో నామ సంకీర్తన మోక్ష ప్రదాయని : టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి
– అలిపిరి పాదాలమండపం వద్ద ఘనంగా మెట్లపూజ
తిరుపతి, 2025 ఫిబ్రవరి 12: శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ కార్యక్రమం భజన మండళ్ల సభ్యులకు మోక్షానికి అవసరమైన జ్ఞానాన్ని ప్రసాదించే మహత్తరమైన కార్యక్రమని టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి అన్నారు. దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం బుధవారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్.ఆనందతీర్థాచార్య ముందుగా మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి అనుగ్రహంతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో శ్రీవారి మెట్లోత్సవం నిర్విగ్నంగా జరుగుతుందని తెలియజేశారు. మానవులు జ్ఞాన పూర్వకంగా, శ్రద్ధతో, యోగ్యతానుసారంగా పని చేయాలని, శ్రేయో మార్గమైన ఇలాంటి అంశాలను అలవరుచుకుంటే జీవనం సుఖమయం అవుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకు చెందిన 3,500 మంది భజన మండళ్ల సభ్యలు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.







