GRAND PROCESSION OF LAKSHMI KASULA HARAM _ వైభవంగా శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభాయాత్ర

Tirupati, 18 Feb. 20: The Shoba Yatra of Srivari Lakshmi Kasula Haram from TTD administrative building to Sri kalyana Venkateswara temple at Srinivasa Mangapuram was held in a big way on Tuesday evening.

The precious ornament will adorn the utsava idols during the Garuda seva this evening on the occasion of ongoing annual Brahmotsavams. JEO Sri P Basant Kumar, Tirumala temple DyEO Sri Harindranath, DyEO Sri Elleppa, Peishkar Sri Lokanatham, Bokkasam In-charge Sri Gururaja, and OSD Sri P Seshadri also participated.

Speaking on the occasion the JEO said it was customary tradition that Lakshmi Kasula Haram from Tirumala is brought to the local temples on the day of Garuda Seva. Apart from this, the ornaments from Tirumala treasury will be presented to the local temples during annual brahmotsavams. This year ornaments worth ₹50 lakh weighing 983.750 gm were presented to Srinivasa Mangapuram temple. They included 529.750 gm gold Thirukkoram (Headband jewel) and two diamond Baavaalis (Ear jewels) weighing 454gm. 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

 

వైభవంగా శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభాయాత్ర

కల్యాణవెంకన్నకు బంగారు తిరుక్కోర‌ము, 2 వ‌జ్రాల భావ‌లీలు బ‌హూక‌ర‌ణ‌

తిరుపతి, 2020 ఫిబ్రవరి 18: తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల‌హారం శోభాయాత్ర మంగ‌ళ‌వారం వైభవంగా జరిగింది. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం నుండి శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగ‌ళ‌వారం రాత్రి గరుడ సేవను పురస్కరించుకుని ఈ హారాన్ని స్వామివారికి అలంకరించనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ దంప‌తులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి స్థానిక ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం నుంచి ఆభరణాలు అందించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇందులో భాగంగా గరుడసేవ నాడు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన లక్ష్మీకాసుల హారాన్ని అలంకరించేందుకు ఊరేగింపుగా తీసుకెళుతున్నట్టు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సుమారు రూ.50 ల‌క్ష‌లు విలువైన 983.750 గ్రాముల బరువు గల ఆభరణాలను బ‌హూక‌రించిన‌ట్లు వెల్ల‌డించారు. ఇందులో 529.750 గ్రాముల బ‌రువైన ప్ర‌భ ఆకారం క‌లిగిన ర‌త్నాలు చెక్కిన బంగారు తిరుక్కోర‌ము, 454 గ్రాముల బ‌రువు గ‌ల 2 వ‌జ్రాల భావ‌లీలు ఉన్నాయ‌ని వివ‌రించారు.

ముందుగా శ్రీవారి లక్ష్మీకాసులహారం, ఆభరణాలను తిరుమల శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, పేష్కార్ శ్రీ లోక‌నాథం తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనానికి తీసుకొచ్చారు.

ఈ లక్ష్మీహారం శోభాయాత్ర తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం నుండి ప్రారంభమై శ్రీ కోదండరామాలయం, రామచంద్ర పుష్కరిణి, మహతి ఆడిటోరియం మీదుగా శ్రీనివాసమంగాపురానికి చేరుకుంది. భజనలు, కోలాటాలతో కోలాహలంగా యాత్రసాగింది. భక్తులు అడుగడుగునా నీరాజనాలు పలికారు.

ఈ కార్యక్రమంలో టిటిడి విఎస్వో శ్రీ ప్ర‌భాక‌ర్‌రావు, శ్రీనివాసమంగాపురం ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ఎల్ల‌ప్ప‌, శ్రీ‌వారి ఆల‌య ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, బొక్క‌సం బాధ్యులు శ్రీ గురురాజారావు ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది