RATHOTSAVAM HELD _ వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడి రథోత్సవం

TIRUPATI, 07 JUNE 2023: As a part of ongoing annual brahmotsavams in Narayanavanam, Sri Kalyana Venkateswara Swamy took out a celestial ride on Ratham where a large number of devotees participated on Wednesday.

 

DyEO Smt Nagaratna, EE Sri Manoharam, DyEE Sri Raghavaiah, AEO Sri Mohan, Superintendent Sri Ekambaram and others were present.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడి రథోత్సవం

తిరుపతి, 2023 జూన్ 07: నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో బుధవారం ఉదయం శ్రీవారు రథాన్ని అధిరోహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని రథాన్ని లాగారు.

ఉదయం 6.30 గంటలకు స్వామివారు రథారోహణం చేశారు. ఉదయం 7.20 రథోత్సవం వైభవంగా ప్రారంభమైంది.

సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు స్వామివారు అశ్వ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు. అనంతరం రాత్రి 7 నుండి 8:30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం కన్నుల పండుగ జరగనుంది.

ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ మోహన్, ఈఈ శ్రీ మనోహర్, డిప్యూటీ ఈఈ శ్రీ రాఘవయ్య, సూప‌రింటెండెంట్ శ్రీ ఏకాంబరం, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ భరత్ పాల్గొన్నారు.

జూన్ 8న చక్రస్నానం :

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన గురువారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం 10 నుండి 11.15 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి, చక్రత్తాళ్వార్‌వారికి వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. తర్వాత శాస్త్రోక్తంగా చక్రస్నానం జరుగనుంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.