SPRING FESTIVAL HELD _ వైభవంగా శ్రీ కల్యాణ శ్రీనివాసుడి వసంతోత్సవం
TIRUPATI, 23 FEBRUARY 2025: Vasanthotsavam was held to the utsava deities in Srinivasa Mangapuram as a part of the ongoing annual brahmotsavams on Sunday.
On the bright Sunny day, giving a chill thrill to the utsava deities who have been busily engaged in morning, evening vahana sevas besides various other rituals from the past six days, the archakas performed the spring festival with aromatic ingredients to the utsava deities and later the mixture was sprinkled on the devotees.
Special Grade DyEO Smt Varalakshmi, AEO Sri Gopinath and other temple staff were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైభవంగా శ్రీ కల్యాణ శ్రీనివాసుడి వసంతోత్సవం
తిరుపతి, 2025 ఫిబ్రవరి 23: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు వసంతోత్సవం వైభవంగా జరిగింది.
వసంతఋతువులో స్వామికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. సుగంధ సంభరిత వికాస పుష్పాలను స్వామికి సమర్పించుటమే కాక వివిధ రకాల ఫలాలను తెచ్చి స్వామికి నివేదించుట కూడా ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ.
బ్రహ్మోత్సవాలలోస్వామి, అమ్మవార్లు ఉదయం, సాయంత్రం అలంకరణలు, వాహనసేవల్లో పాల్గొని అలసి వుంటారు కావున ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవాలు నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు. వసంతోత్సవంలో భాగంగా చందనంతోపాటు పలురకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో శ్రీ భూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి విశేషంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చకులు, భక్తులు అహ్లాదకరంగా వసంతాలు ( గంథం కలిపిన నీళ్ళు) చల్లుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.