GRAND COMMENCEMENT OF JYESTABHISHEKAM AT SRI GOVINDARAJA SWAMY TEMPLE _ వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం ప్రారంభం

Tirupati, 06 July 2025: The annual three-day Jyestabhishekam festival commenced on a grand note at Sri Govindaraja Swamy Temple in Tirupati on Sunday. This traditional ritual is observed during every Ashada month.

Snapana Tirumanjanam was performed to the Utsava Murthis of Sri Govindaraja Swamy along with Sridevi and Bhudevi at the Kalyana Mandapam in the Temple in the morning.

Later special pujas were offered to the Kavachams, followed by Kavachaadhivasam. 

In the evening, the deities will bless devotees during a grand procession on Tiruchi along the four mada streets of the temple.

HH Sri Pedda Jeeyar Swamy, HH Sri Chinna Jeeyar Swamy of Tirumala, Dy EO Smt. V.R. Shanthi, AEO Sri Munikrishna Reddy, temple priests, and other officials were also present.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుపతి, 2025, జూలై 06 : తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఆషాఢ మాసంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో భాగంగా ఆదివారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి కైంకర్యాలు  శ‌త‌క‌ల‌శ‌ స్న‌ప‌నం, మ‌హాశాంతి హోమం చేప‌ట్టారు. ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం స్వామి వారి కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కవచాధివాసం చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు. 

ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, అర్చకులు, తదితర అధికారులు పాల్గొన్నారు. 

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.