PAVITROTSAVAMS BEGINS _ వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం
TIRUPATI, 16 SEPTEMBER 2024: The Annual Pavitrotsavams at Sri Padmavati Ammavari Temple in Tiruchanoor began with grandeur on Monday.
Special ceremonies, including Dwaratoranam, Dwajakumbha Avahanam, Chakradi Mandala Puja, Chatursnana Archana, Agni Pratishta, and Pavitra Pratishta, were performed for the Utsava Deities at the Yagashala.
During the day, at Sri Krishna Mukha Mandapam, Snapana Tirumanjanam was performed in front of Grihasta devotees.
Temple DyEO Sri Govindarajan, AEO Sri Ramesh, Superintendent Sri Seshagiri and others were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2024 సెప్టెంబరు 16: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటిరోజు శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఆలయం నుండి యాగశాలకు వేంచేపు చేశారు. అనంతరం ద్వారతోరణ ధ్వజకుంభ ఆవాహనం, చక్రాధి మండలపూజ, చతుస్థానార్చన, అగ్నిప్రతిష్ఠ, పవిత్రప్రతిష్ఠ నిర్వహించారు.
అనంతరం శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బనీళ్లతో, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటి ఈఓ శ్రీ గోవింద రాజన్, ఎఇఓ శ్రీ రమేష్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, సూపరింటెండెంట్ శ్రీ శేషగిరి, టెంపుల్ ఇన్స్‌పెక్టర్లు శ్రీ సుభాష్, శ్రీ గణేష్, తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.