CHAKRASNANAM HELD _ వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి చక్రస్నానం
Tirupati, 25 February 2025: The annual Brahmotsavam at Sri Padmavati Ammavari temple in Chennai concluded with Chakrasnanam on Tuesday.
Earlier the Archakas offered Snapana Tirumanjanam to the utsava deity.
AEO Sri Parthasaradhi, Superintendent Smt Pushpalata and others were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి చక్రస్నానం
చెన్నై/ తిరుపతి, 2025 ఫిబ్రవరి 25: తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం ఉదయం 10.40 గంటలకు చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది.
అంతకుముందు అర్చకులు అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.
ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకొంటారో వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారు.
రాత్రి 7.30 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ పార్థసారధి, సూపరింటెండెంట్ శ్రీమతి పుష్పలత, ఆలయ అర్చకులు ఇతర అదికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.