GRAND SNAPANA TIRUMANJANAM FETE AT SRIVARI TEMPLE _ వైభవంగా శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారికి స్నపన తిరుమంజనం
Tirumala, 10 April 2022: As part of Sri Rama Navami Asthana celebrations, TTD organised a grand Snapana Tirumanjanam fete for utsava idols of Sri Sitaram Lakshmana sameta Anjaneya at Srivari temple on Sunday morning.
The celestial fete was performed after daily rituals in the morning as Vedic pundits chanted Taittariya Upanishad, Purusaivari Suktam, Sri Suktam, Nila Suktam, Pancha Shanti mantras and pasuras from Divya Prabandam to enhance the divine glory of the Srivari temple.
Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyar Swamy and Sri Sri Sri Chinna Jeeyar Swamy, TTD EO Dr KS Jawahar Reddy, DyEO Sri Ramesh Babu, VGO Sri Bali Reddy and others were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
వైభవంగా శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారికి స్నపన తిరుమంజనం
తిరుమల, 2022 ఏప్రిల్ 10: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని శ్రీసీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ మరియు అర్చన నిర్వహించారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.
ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు. ఈ వేద పఠనంతో శ్రీవారి ఆలయం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్‌బాబు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.