TTD AS A ROLE MODEL IN WASTE MANAGEMENT _ వ్యర్థాల నిర్వహణలో దేశంలో ఇతర ఆలయాలకు టీటీడీ ఆదర్శంగా నిలుస్తుంది: టీటీడీ అదనపు ఈవో శ్రీ సి హెచ్. వెంకయ్య చౌదరి
CLEANLINESS IS THE REFLECTION OF CIVILIZATION
ALL DEVOTEES SHOULD CONTRIBUTE TO CLEAN TIRUMALA
ADDITIONAL EO TTD TTD
Tirumala, 15 February 2025: TTD will stand as an example for other temples in the country in terms of waste management, asserted Sri Ch Venkaiah Chowdary, the Additional EO of TTD.
He took the Swachh Andhra pledge on Saturday with the TTD officials at the laddu counter in Tirumala on Saturday.
On this occasion, the Additional EO said that cleanliness is a reflection of civilization and culture, and there is a saying that where cleanliness is good, there is good governance and discipline.
He said that henceforth the Swachh Tirumala program will be conducted on the third Saturday of every month as part of Swachh Andhra Pradesh. Many programs have been undertaken for cleanliness in Tirumala. He said that 1200 personnel have been working round the clock for keeing Tirumala premises clean and tidy.
The TTD health department is monitoring the sanitation from time to time.
He said that for the last seven months in Tirumala, we have been paying special attention towards waste management. He said that 2 lakh tonnes of garbage accumulated in the Tirumala dumping yard has been converted into manure. Another 40 thousand metric tons of legacy waste will be removed in the next two months.
It is said that 78 metric tons of wet and dry garbage is generated in Tirumala every day. It has been revealed that 1.5 metric tonnes of gas will be produced from 45 metric tonnes of wet waste through the IOCL plant being set up in Tirumala from June and will be used in the Prasada centre called Tarigonda Vengamamba in Tirumala.
In the feedback collected from the devotees during the special occasion of Ratha Saptami in Tirumala, 97 percent of the devotees expressed satisfaction with the cleanliness. Even though there was a huge amount of waste, it was informed that the next moment the garbage was removed and moved to the dumping yard.
He informed that everyone should be a partner in the Swachh Tirumala program and if all the devotees follow the instructions of TTD and separate the garbage with discipline and put it in the prescribed garbage bins, the work of the sanitation staff will be easier.
Deputy EO Sri Lokanatham, EE-1 Sri Subramaniam, Health Officer Sri Madhusudan, Unit Officer Shri Thyagaraju and other officers participated in this program.
In Tirupati
As part of Swachh Andhra Pradesh, TTD officials took the Swachh Andhra Pledge on Saturday at the TTD Administration building in Tirupati.
On this occasion, the employees were made aware that wet garbage, dry garbage and chemical garbage should be thrown separately.
TTD CE Sri Satya Narayana, Additional Health Officer Dr Sunil Kumar and other officials participated in this program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వ్యర్థాల నిర్వహణలో దేశంలో ఇతర ఆలయాలకు టీటీడీ ఆదర్శంగా నిలుస్తుంది
స్వచ్ఛత నాగరికతకు ప్రతిబింబం
భక్తులందరూ స్వచ్ఛ తిరుమలకు సహకరించాలి
టీటీడీ అదనపు ఈవో శ్రీ సి హెచ్. వెంకయ్య చౌదరి
తిరుమల, 2025 ఫిబ్రవరి 15: రాబోయే కాలంలో వ్యర్థాల నిర్వహణలో టీటీడీ దేశంలోని ఇతర దేవాలయాలకు ఆదర్శంగా నిలుస్తుందని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి హెచ్ వెంకయ్య చౌదరి తెలియజేశారు. తిరుమలలోని లడ్డూ కౌంటర్ వద్ద శనివారం టీటీడీ అధికారులతో కలిసి ఆయన స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛత అనేది నాగరికతకు, సంస్కృతికి ప్రతిబింబమని, ఎక్కడైతే స్వచ్ఛత బాగుంటుందో అక్కడ పరిపాలన, క్రమశిక్షణ బాగున్నట్లు అనే నానుడి ఉందన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛ తిరుమల కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. తిరుమలలో స్వచ్ఛత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. తిరుమలలో 24 గంటల పాటు 1200 మంది సిబ్బంది నిరంతరంగా పరిశుభ్రత కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. టీటీడీ ఆరోగ్య విభాగం ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షిస్తోందన్నారు.
తిరుమలలో గత ఏడు నెలలుగా వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు. తిరుమల డంపింగ్ యార్డులో పేరుకుపోయిన 2 లక్షల టన్నుల చెత్తను ఎరువుగా మార్చినట్లు తెలిపారు. మరో 40వేల మెట్రిక్ టన్నుల లెగసీ వ్యర్థాలను రాబోయే రెండు నెలల్లో పూర్తిస్తాయిలో తొలగిస్తామన్నారు.
తిరుమలలో రోజుకు 78 మెట్రిక్ టన్నుల తడి, పొడి చెత్త ప్రోగవుతోందన్నారు. తిరుమలలో ఏర్పాటు చేస్తున్న ఐఓసీఎల్ ప్లాంట్ ద్వారా జూన్ నెల నుంచి 45 మెట్రిక్ టన్నుల తడి చెత్తతో 1.5 మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉత్పత్తి చేసి తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు.
తిరుమలలో రథ సప్తమి రోజున భక్తుల నుండి సేకరించిన అభిప్రాయాల్లో పారిశుద్ధ్యంపై 97శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. భారీగా వ్యర్థాలు ప్రోగైనప్పటికీ మరు క్షణంలోనే చెత్తను తొలగించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నట్లు తెలియజేశారు.
స్వచ్ఛ తిరుమల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని, భక్తులందరూ టీటీడీ సూచనలను పాటించి క్రమశిక్షణతో చెత్తను వేరు చేసి సూచించిన చెత్త కుండీలలో వేస్తే పారిశుద్ధ్య సిబ్బందికి పని చేయడం సులువవుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఈఈ-1 శ్రీ సుబ్రమణ్యం, హెల్త్ ఆఫీసర్ శ్రీ మధుసూదన్, యూనిట్ ఆఫీసర్ శ్రీ త్యాగరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుపతిలో
స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ లో భాగంగా తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం, ఉద్యోగుల క్వార్టర్స్ వద్ద శనివారం టీటీడీ అధికారులు స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా తడి చెత్త, పొడి చెత్త, రసాయన చెత్తలను వేర్వేరుగా వేయాలని ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ శ్రీ సత్య నారాయణ, అడిషనల్ హెల్త్ ఆఫీసర్ శ్రీ సునీల్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.