SHANTI KALYANAM AND GARUDA SEVA AT KALIGIRI KONDA ON JULY 13 _ జూలై 13న కలిగిరికొండ ఆలయంలో శాంతికల్యాణం, గరుడసేవ

Tirupati, 12 July 2025: At Sri Venkateswara Swamy temple in Kaligirikonda, Shanti Kalyanam will be held on July 13 at 11 AM as a part of the Mandalabhishekam. 

The deities will be adorned and seated on the Kalyana Mandapam with Vedic chants and devotional rituals.

In the evening, from 5 PM to 6.30 PM, Garuda Seva will be conducted, offering darshan to devotees.

On July 12, rituals including Snapanam, Jaladhivasam, and Homams were held as part of the Mandalabhishekam celebrations.

Special Grade Deputy EO Smt. Varalakshmi, Temple Inspector Sri Dilip, and temple priests participated in the rituals.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 13 కలిగిరికొండ ఆలయంలో శాంతి కల్యాణం, గరుడ సేవ

శనివారం ఘనంగా జలాధివాసములు, స్నపనం

తిరుపతి, 2025, జూలై 12: చిత్తూరు జిల్లా కలిగిరికొండ శ్రీ కలిగిరి వేంకటేశ్వర స్వామి ఆలయంలో మండలాభిషేకం సందర్భంగా జూలై 13న ఉదయం 06.00 – 07.30 గం.ల వరకు పుణ్యాహం, పూర్ణాహుతి జరుగనుంది. అటు తర్వాత ఉదయం 07.55 – 08.20 గం.ల వరకు ఉత్సవమూర్తిగా కళావాహనం, స్నపన తిరుమంజనం, అలంకారం చేపడుతారు. ఉదయం 11.00 గం.లకు శాంతి కల్యాణం వైభవంగా జరుగనుంది. ఉత్సవ మూర్తులను ముస్తాబు చేసి మేళతాళాల నడుమ కల్యాణ వేదికపైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారు ఆశీనులుకానున్నారు. పండితుల మంత్రోచ్చరణలు, భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయం భక్తి పారవశ్యంతో నిండిపోనుంది. మాంగల్యధారణ, ముత్యాల తలంబ్రాల క్రతువులను భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 05.00 – 06.30 గం.ల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారు గరుడ సేవపై ఊరేగించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు.

మండలాభిషేకం సందర్భంగా జూలై 12వ తేదీ శనివారం ఉదయం 08.00 – 12.00 గం.ల వరకు పుణ్యాహం, ఉత్సవమూర్తికి చతుర్థశ కళశ స్నపనం, పంచగవ్య క్షీర, జలాధివాసములు, అధివాసాంగ హోమం చేపట్టారు. సాయంత్రం 05.30 – 08.30 గం.ల  వరకు సర్వదైవత్యం, హోమం, మహాశాంతి హోమం, ధాన్యాధివాసం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, టెంపుల్ ఇన్పెక్టర్ శ్రీ దిలీప్, అర్చకులు పాల్గొన్నారు.

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.