శాసనాల ద్వారా శ్రీ‌వారి వైభ‌వాన్ని చాటిన శ్రీ సాధు సుబ్ర‌హ్మ‌ణ్యశాస్త్రి : – టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి

TIRUPATI, 10 SEPTEMBER 2023: TTD Chairman Sri Bhumana Karunakara Reddy said that Sri Sadhu Subrahmanya Shastri was a great man who translated the inscriptions of the Tirumala Srivari Temple and spread the history of the temple and the glory of Sri Venkateswara Swamy to the world through his impeccable works.

He said Sri Shastry will remain immortal as long as the temple of Srivaru exists.

Speaking on the 42nd death anniversary of the versatile person at Annamacharya Kalamandiram in Tirupati on Sunday the TTD Chairman said that Sri Shastry unearthed and solved more than a thousand inscriptions encripted on the walls of Tirumala temple while serving as a small-level employee in TTD.

Out of the 32 thousand Sankeertans written by Saint Poet Annamacharya, only 12 thousand Sankeertans are available.  Sri Shastry resolved most of them and presented to the society.

The Chairman also said that he was lucky to come in contact with such a great man during his school days itself.  The TTD Board Chief called upon the students to learn about the lives of such great people and their efforts.

 Acharya Sri Rama Suryanarayana, Acharya Sri Krishna Reddy delivered lectures on Sri Shastry’s contributions on the occasion.

Ealier the floral tribute were paid to the statue of Sri Shastry in front of SVETA building.

Sri Gauri Peddi Ramasubba Sharma statue unveiled.

TTD Chairman also unveiled the statue of Sri Gauri Peddi Ramasubba Sharma installed in the premises of SV Oriental College commemorating the 101st Birth Anniversary of the legendary personality.

JEO (H&E) Smt Sada Bhargavi, Sri Sadhu Subrahmanya Shastry daughter Smt Girija, Grandson and Judge Sri Murty, SVETA Director Smt Prasanthi, Annamacharya Project Director Sri Vibhishana Sharma were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శాసనాల ద్వారా శ్రీ‌వారి వైభ‌వాన్ని చాటిన శ్రీ సాధు సుబ్ర‌హ్మ‌ణ్యశాస్త్రి : – టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి

42వ వర్ధంతి సంద‌ర్భంగా ఘనంగా నివాళులు

తిరుపతి, 2023 సెప్టెంబ‌రు 10: తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోని శాసనాలను అనువదించి ఆల‌య చ‌రిత్ర‌ను, శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మ‌హ‌నీయుడు శ్రీ సాధు సుబ్రహ్మ‌ణ్యశాస్త్రి అని టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి అన్నారు . శ్రీవారి ఆలయం ఉన్నంతవరకు ఆయన చిరంజీవిగా నిలుస్తారన్నారు.

తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం జరిగిన శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 42వ వర్ధంతి సభకు చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ కరుణాకర రెడ్డి ఉప‌న్య‌సిస్తూ, టీటీడీలో చిన్న స్థాయి ఉద్యోగిగా ఉంటూ వెయ్యికి పైగా శాసనాలను వెలికితీసి పరిష్కరించిన గొప్ప వ్యక్తి శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి అని చెప్పారు. అన్నమయ్య రచించిన 32 వేల సంకీర్తనల్లో 12 వేల సంకీర్తనలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇందులో అధిక భాగం సంకీర్తనలను శ్రీ శాస్త్రి పరిష్కరించి సమాజానికి అందించినట్లు ఆయన వివరించారు.
అలాంటి మహానుభావునితో పాఠశాల చదివే రోజుల్లోనే పరిచయం కావడం తన అదృష్టమని ఆయన తెలిపారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అమూల్యమైన సేవలందించిన శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి, శ్రీ రాళ్ళ పల్లి అనంత కృష్ణ శర్మ విగ్రహాలు ప్రతిష్టించాలనే ఆలోచన శ్రీ వేంకటేశ్వర స్వామి వారే తనకు కల్పించారన్నారు. ఇలాంటి మహానుభావుల జీవితాలను, వారు చేసిన కృషిని విద్యార్థులు తప్పని సరిగా తెలుసుకోవాలని చైర్మన్ పిలుపు నిచ్చారు. వీరి సేవలు తెలుసుకుని సమాజానికి ఉపయోగపడే వారిలా మారితేనే చదువుకు సార్థకత లభిస్తుందని ఆయన చెప్పారు. శ్రీ సాధు సుబ్రమణ్య శాస్త్రి వెలికి తీసి పరిష్కరించిన శాసనాల పుస్తకాలను పిల్లలు, పెద్దలు కూడా చదవాలని పిలుపునిచ్చారు.

ఆచార్య శ్రీ రామ సూర్యనారాయణ “శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి యోగ దానం” అనే అంశంపై, ప్రముఖ శాసన పరిశోధకులు ఆచార్య
శ్రీ కృష్ణారెడ్డి “శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి పరిశోధన దీక్ష” అనే అంశంపై ఉపన్యసించారు.

అంతకుముందు శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి 42వ వర్ధంతి సందర్భంగా తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా గల ఆయన విగ్రహానికి చైర్మన్ శ్రీ కరుణాకర రెడ్డి పుష్పాంజలి ఘటించారు.

– శ్రీ గౌరి పెద్ది రామసుబ్బ శర్మ విగ్రహావిష్కరణ

ఎస్వీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన శ్రీ గౌరి పెద్ది రామసుబ్బశర్మ విగ్రహాన్ని చైర్మన్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీమతి సదా భార్గవి, శ్రీ శాస్త్రి కూతురు శ్రీమతి గిరిజ, మనుమడు, జడ్జి శ్రీ మూర్తి, శ్వేత సంచాలకులు శ్రీమతి ప్రశాంతి, అన్నమాచార్య ప్రాజెక్ట్ సంచాలకులు శ్రీ విభీషణ శర్మ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.