VISHWA SHANTI HOMAM COMMENCED _ శాస్త్రక్తంగా శ్రీ శ్రీనివాస విశ్వశాంతి హోమం ప్రారంభం
TIRUMALA, 13 DECEMBER 2022: Sri Srinivasa Viswashanti Homam commenced in Dharmagiri Veda Vignana Peetham on Tuesday.
According to Principal Sri KSS Avadhani this Homam seeking well-being of entire humanity will be performed by Ritwiks upto December 18.
This ritual will be telecasted live on SVBC between 9am and 12noon again from 6pm to 8:30pm for the sake of global devotees.
శాస్త్రక్తంగా శ్రీ శ్రీనివాస విశ్వశాంతి హోమం ప్రారంభం
తిరుమల, 13 డిసెంబరు, 2022: తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో శ్రీ శ్రీనివాస విశ్వశాంతి హోమం మంగళవారం ఉదయం వైఖానస ఆగమక్తంగా ప్రారంభమైంది.
ఈ సందర్భంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, పంచగవ్యారాధన,
దీక్ష హోమాలు, మొదటిరోజు విష్ణు హోమం నిర్వహించారు. ఆ తరువాత యాగశాల వైదిక కార్యక్రమాలు, తీర్థప్రసాద వినియోగం చేశారు.
ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని ఆధ్వర్యంలో 18వ తేదీ వరకు 21 మంది రుత్వికులు 7 హోమ గుండాలలో శ్రీ శ్రీనివాస విశ్వశాంతి హోమం నిర్వహించనున్నారు.
ప్రతిరోజూ ఉదయం 9 నుండి 12 గంటల వరకు, సాయంత్రం 6 నుండి 8.30 గంటల వరకు హోమ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.