ANKURARPANAM HELD _ శాస్త్రోక్తంగా దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Tirupati, 28 January 2025: Ankurarpanam in connection with the annual Brahmotsavam at Devuni Kadapa was held on Tuesday in the Kadapa district.

As the annual festival is commencing with Dhwajarohanam on Wednesday between 9:30am and 10:30am, the ritual of prelude Ankurarpanam was observed the preceding night.

Superintendent Sri Hanumantaiah, Temple Inspector Sri Eswar Reddy, archakas and others were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శాస్త్రోక్తంగా దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుపతి, 2025 జనవరి 28: కడప జిల్లాలోని దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జనవరి 29 నుండి ఫిబ్రవరి 6వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో అంకురార్పణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం 6 గంటలకు శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా సాయంత్రం 6 గంటలకు మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం జరిగింది.

జనవరి 29న ధ్వజారోహణం :

జనవరి 29వ తేదీ బుధవారం ఉదయం 9.30 – 10.30 గం.ల మధ్య మీనల‌గ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ జరుగనున్నాయి.

బ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువ పందిళ్లు వేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. ప్రతిరోజూ వాహనసేవల ముందు కళాబృందాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వాహన సేవలు ప్రతిరోజూ ఉదయం 9 నుండి 10 గంటల వరకు, తిరిగి రాత్రి 8 నుండి 9 గంటల వరకు జరుగనున్నాయి.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ ఈశ్వర్ రెడ్డి, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

29-01-2025

ఉదయం – ధ్వజారోహణం,

రాత్రి – చంద్రప్రభ వాహనం.

30-01-2025

ఉద‌యం – సూర్యప్రభవాహనం,

రాత్రి – పెద్దశేష వాహనం.

31-01-2025

ఉద‌యం – చిన్నశేష వాహనం,

రాత్రి – సింహ వాహనం.

01-02-2025

ఉద‌యం – కల్పవృక్ష వాహనం,

రాత్రి – హనుమంత వాహనం.

02-02-2025

ఉద‌యం – ముత్యపుపందిరి వాహనం,

రాత్రి – గరుడ వాహనం.

03-02-2025

ఉద‌యం – కల్యాణోత్సవం,

రాత్రి – గజవాహనం.

04-02-2025

ఉద‌యం – రథోత్సవం,

రాత్రి – ధూళి ఉత్సవం.

05-02-2025

ఉద‌యం – సర్వభూపాల వాహనం,

రాత్రి – అశ్వ వాహనం.

06-02-2025

ఉద‌యం – వసంతోత్సవం, చక్రస్నానం,

రాత్రి – హంసవాహనం, ధ్వజావరోహణం.

ఫిబ్రవరి 3న తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, అర్చన, తోమల నిర్వహిస్తారు. అనంత‌రం శ్రీ‌వారి జ‌న్మ‌న‌క్ష‌త్ర‌మైన శ్ర‌వ‌ణా న‌క్ష‌త్రాన్ని పుర‌స్క‌రించుకుని ఉద‌యం 10 గంటల నుండి స్వామివారి క‌ల్యాణం వైభ‌వంగా నిర్వ‌హిస్తారు. ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.

టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.