ANKURARPANAM FOR BALALAYAM SAMPROKSHANAM AT DEVNUNI KADAPA HELD _ శాస్త్రోక్తంగా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామివారి ఆలయంలో బాలాలయం సంప్రోక్షణకు అంకురార్పణ
Tirupati, 18 August 2025: At Sri Lakshmi Venkateswara Swamy Temple, Devuni Kadapa, Ankurarpanam for the Balalayam Samprokshanam was performed in a traditional and devotional manner on Monday evening.
As part of the program, at 5:30 PM, Ankurarpanam and Jalabhishekam were performed to the Balabimbas at the Yagashala.
On August 19, at 8 AM, Vedic rituals including Shanti Homam and Vastu Homam will be conducted in the Yagashala.
On August 20, at 9:30 AM, Maha Poornahuti will be performed.
Deputy EO Smt. Prashanthi, Superintendent Sri Hanumanthayya, Temple Inspector Sri P. Eshwar Reddy, and temple priests participated in the program.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
తిరుపతి, 2025 ఆగస్టు 18: దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామివారి ఆలయంలో సోమవారం సాయంత్రం బాలాలయ సంప్రోక్షణకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.
ఇందులో భాగంగా సాయంత్రం 5.30 గంటలకు ఆలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శాస్త్రోక్తంగా అంకురార్పణ, బాల బింబాలకు జలాభిషేకం నిర్వహించారు.
కాగా, ఆగస్టు 19న ఉదయం 8 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, శాంతి హోమం, వాస్తు హోమం నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు కళాకర్షణలో భాగంగా గర్భాలయంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి మూలమూర్తి శక్తిని కుంభంలోకి ఆవాహన చేసి యాగశాలలో ప్రతిష్టించి ఆరాధనలు చేపడతారు.
ఆగస్టు 20వ తేదీన ఉదయం 9.30 గంటలకు మహాపూర్ణాహుతి, ఉదయం 10 నుంచి 11.15 గంటల మధ్య తులా లగ్నంలో బాల బింబ ప్రతిష్ట, బాలాలయ సంప్రోక్షణ నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, సూపరిండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ పి. ఈశ్వర్ రెడ్డి, అర్చకులు పాల్గొన్నారు.




