KODANDARAMA CHAKRASNANAM AT VONTIMITTA _ శాస్త్రోక్తంగా శ్రీ కోదండరాముడి చక్రస్నానం
Vontimitta, 29 Apr. 21: TTD organised a solemn chakrasnanam event on Thursday morning at Sri Kodandarama Swamy temple in ekantha as part of the final day celebrations of the Sri Ramanavami Brahmotsavam as per, Covid guidelines.
The festivities included temple Shuddi and Aradhana at early hours and thereafter utsava idols of Sri Lakshmana sameta Sri Sitarama and Sri Sudarshan Chakrathalwar were seated at Ranga Mandapam
Under the stewardship of Kankana bhattar Sri Rakesh Bhattar, the rituals of Punya Havachanam and Snapana thirumanjanam was performed. Thereafter the divine fete of Chakrasnanam was conducted in the gangalam amidst Veda mantras and Mangala vadyams.
The traditional practices of Nivedana, Mantra Pushpa and Mangala harati heralded the conclusion of the celestial event.
Later tonight the final ritual, the Dwajavarohanam, will herald the conclusion of the nine-day Brahmotsavam.
Temple AEO Sri Muralidhar, Superintendent Sri Venkateshaiah, Inspectors Sri Dhananjayulu, Sri Giribabu, archakas and other staff were present
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శాస్త్రోక్తంగా శ్రీ కోదండరాముడి చక్రస్నానం
ఒంటిమిట్ట, 2021 ఏప్రిల్ 29: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన గురువారం ఉదయం ఆలయంలోని రంగ మండపంలో చక్రస్నానం (అవభృథోత్సవం) జరిగింది. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా చక్రస్నానం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఉదయం 4.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారి మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన నిర్వహించారు. తరువాత శ్రీ లక్ష్మణ సమేత సీతారాములవారు, సుదర్శన చక్రత్తాళ్వార్‌ను ఆలయంలోని రంగ మండపంలో వేంచేపు చేశారు.
కంకణ బట్టర్ శ్రీ రాజేష్ భట్టార్ ఆధ్వర్యంలో ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు పుణ్యాహవచనం, స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు నవకలశ స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకాలు అందుకుని ప్రసన్నులయ్యారు. అనంతరం అర్చకులు వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా గంగాళంలో చక్రస్నానం నిర్వహించారు. తరువాత నివేదన, మంత్రపుష్పం, మంగళ హారతి సమర్పించారు.
కాగా రాత్రి 7.00 గంటలకు ధ్వజావరోహణంతో శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ మురళీధర్, సూపరింటెండెంట్ శ్రీ వెంకటేశయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ గిరిబాబు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పుష్పయాగం
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు పుష్పయాగం నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.