KOIL ALWAR HELD _ శాస్త్రోక్తంగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirupati, 16 October 2025: In connection with Deepavali Asthanam on October 20, traditional Temple cleaning festival Koil Alwar Tirumanjanam was observed on Thursday in Sri Govindaraja Swamy temple in Tirupati.
DyEO Smt Shanti, AEO Sri Chowdary and others were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శాస్త్రోక్తంగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, 2025, అక్టోబర్ 16: తిరుపతి శ్రీ స్వామివారి ఆలయంలో అక్టోబరు 20న దీపావళి ఆస్థానం సందర్భంగా గురువారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ సందర్భంగా ఉదయం 5 గం.లకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన, నివేదన, శాత్తుమొర నిర్వహించారు. తదుపరి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా గోడలకు (లేపనం) పూశారు. అనంతరం భక్తులను ఉదయం 09.30 గంటల తర్వాత సర్వ దర్శనానికి అనుమతించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, అర్చకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.




