PADMAVATHI BLESSES ON TERU _ శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం

Tiruchanoor, 18 Nov. 20: On the penultimate day of annual karthika brahmotsavams at Tiruchanoor on Wednesday, Goddess Sri Padmavathi Devi blessed devotees in her Nijaswarupa as Padmavathi Devi on Teru.

In view of Covid, in the place of Maha Ratham, the Goddess draped in Muttangi Alankaram was seated on Brahma Teru (the small wooden chariot which is usually leads the procession during Brahmotsava Vahana Sevas).

Both the senior and junior Jiyar Swamijis of Tirumala, Ex-officio Dr C Bhaskar Reddy,TTD JEO Sri P Basanth Kumar, CE Sri Ramesh Reddy, DyEO Smt Jhansi Rani, Additional Health Officer Dr Sunil Kumar, VGO Sri Bali Reddy, AEO Sri Subramanyam were also present.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం

తిరుపతి, 2020 న‌వంబ‌రు 18: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన బుధవారం ఉదయం ముత్యపు (ముత్తంగి) అలంకారంలో అమ్మవారు రథంపై దర్శనమిచ్చారు. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ప్రత్యేకంగా తయారు చేసిన చిన్న చెక్క రథంపై అమ్మ‌వారిని వేంచేపు చేశారు. ఈ రథోత్సవం ఏకాంతంగా జ‌రిగింది.

శరీరం – రథం, ఆత్మ- రథికుడు, బుద్ధి – సారథి, మనస్సు – పగ్గాలు, ఇంద్రియాలు – గుర్రాలు. ఇంద్రియ విషయాలు రథం నడిచే త్రోవలు. రథం రథికుణ్ణి చూడమంటుంది. రథికుడు పగ్గాల సాయంతో గుర్రాలను అదిలిస్తూ, దారుల వెంబడి పరుగులు తీయించినట్లే ఇంద్రియాలతో, మనస్సుతో కూడిన ఆత్మవిషయాల్ని అనుభవిస్తూ ఉంటుంది. రథోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయక్షేత్రాలలో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన పాలకడలి గారాలపట్టిని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది.

           
వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, టిటిడి బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జెఈవో శ్రీ‌ పి.బ‌సంత్‌కుమార్ దంప‌తులు, సిఇ శ్రీ ర‌మేష్‌రెడ్డి, విఎస్వో శ్రీ బాలిరెడ్డి‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ కుమార్, ఏవిఎస్వో శ్రీ చిరంజీవి, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ క‌న్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.