ANKURARPANAM HELD AT TARIGONDA SLN TEMPLE BTU _ శాస్త్రోక్తంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
Tirupati, March 05, 2025: As part of the annual Brahmotsavam to be held from March 6 to 14 at the Tarigonda Sri Lakshmi Narasimha Swamy Temple the Ankurarpanam fete was held on Wednesday at 6 pm.
AEO Sri Gopinath, Temple Inspector Sri Krishnamurthy, temple priests and other officials participated in the program.
Among others, the Dwajarohanam fete will be held on March 6:
As part of this, the Tiruchi Utsavam will be held from 7 am to 8 am in the Meena Lagna. The Hamsa Vahana Seva will be held from 7 pm to 8 pm on the same day.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శాస్త్రోక్తంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి, 2025 మార్చి 05: తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మార్చి 6 నుండి 14వ తేదీ వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు బుధవారం సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ జరిగింది. అంకురార్పణం సందర్భంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు.
సాయంత్రం 6 గంటల నుండి పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ గోపినాథ్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కృష్ణమూర్తి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మార్చి 6న ధ్వజారోహణం :
మార్చి 6వ తేదీ ధ్వజారోహణంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 7 నుండి 8 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. ఉదయం 8 నుండి 8.30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. అదేరోజు రాత్రి 7 నుండి 8 గంటల వరకు హంస వాహనసేవ జరుగనున్నాయి.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.