శుభప్రదం ప్రారంభోత్సవానికి విచ్చేయనున్న ప్రముఖులు

శుభప్రదం ప్రారంభోత్సవానికి విచ్చేయనున్న ప్రముఖులు

తిరుమల, మే 10, 2013: తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో శుభప్రదం పేరిట తలపెట్టిన వేసవి శిక్షణ తరగతుల ప్రారంభ కార్యక్రమాలకు రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రముఖులు విచ్చేయనున్నారు. ఏడు రోజుల పాటు జరుగనున్న ఈ శిక్షణ తరగతులు ఆదివారం ప్రారంభం కానున్నాయి.

చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో రాష్ట్ర గనుల శాఖ మంత్రి శ్రీమతి గల్లా అరుణకుమారి, పార్లమెంటు సభ్యులు శ్రీ చింతామోహన్‌, శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర్‌రెడ్డి, తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం, తితిదే పాలకమండలి సభ్యులు శ్రీ శ్రీనాథరెడ్డి, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ బి.వి.పట్టాభిరామ్‌ పాల్గొననున్నారు.
హైదరాబాదులో తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు, తిరుపతి జెఇఓ శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తితిదే పాలకమండలి సభ్యురాలు శ్రీమతి పి.రాజేశ్వరి, గుంటూరులో తితిదే పాలకమండలి సభ్యురాలు శ్రీమతి కాండ్రు కమల పాల్గొననున్నారు.

కడపలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ సి.రామచంద్రయ్య, కలెక్టర్‌ శ్రీ కోనా శశిధర్‌, తితిదే సివిఎస్‌వో శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌, వైజాగ్‌లో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి శ్రీ ఎం.జి.గోపాల్‌, కమిషనర్‌ శ్రీ జి.బలరామయ్య, కలెక్టర్‌ శ్రీ వి.శేషాద్రి హాజరుకానున్నారు.
ఖమ్మంలో మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి, కృష్ణా జిల్లా ఉయ్యూరులో మంత్రి సి.పార్థసారథి, ప్రముఖ పండితులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు, మహబూబ్‌నగర్‌లో తితిదే తిరుమల జెఇఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, నల్గొండలో తితిదే పాలకమండలి సభ్యుడు శ్రీ రేపాల శ్రీనివాస్‌, నిజామాబాద్‌లో మంత్రి శ్రీ సుదర్శన్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో శ్రీ జి.ప్రసాద్‌కుమార్‌, శ్రీకాకుళంలో మంత్రి శ్రీ ధర్మాన ప్రసాదరావు, విజయనగరంలో తితిదే పాలకమండలి సభ్యుడు శ్రీ చొక్కపు లక్ష్మణరావు పాల్గొననున్నారు.
              
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.