PEDDA SESHA VAHANA SEVA HELD _ శేషవాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల కటాక్షం
VONTIMITTA/TIRUMALA, 06 APRIL 2025: The vahana sevas in Vontimitta annual fete commenced with Pedda Sesha Vahanam on Sunday evening.
Sri Sita Lakshmana sameta Sri Ramachandra Murty took out a celestial ride atop the seven hooded Adisehsa to bless His along the mada streets encircling the temple.
DyEO Sri Natesh Babu, Superintendent Sri Hanumantaiah and others were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శేషవాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల కటాక్షం
ఒంటిమిట్ట / తిరుపతి, 2025 ఏప్రిల్ 06: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన ఆదివారం రాత్రి శేషవాహనంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారు భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటల నుండి భజన బృందాల కోలాటాల నడుమ పురవీధుల్లో వాహనసేవ జరిగింది.
ఆదిశేషుడు స్వామివారికి మిక్కిలి సన్నిహితుడు. త్రేతాయుగంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శేషుడు అవతరించాడు. శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఇతడు ఆద్యుడు. భూభారాన్ని వహించేది శేషుడే. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి.
వాహన సేవలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ నటేష్ బాబు, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నవీన్, ఇతర అధికారులు ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.