MALAYAPPA RIDES FLORAL PALANQUIN _ పుష్ప పల్లకీపై శ్రీ భూ సమేత మలయప్పస్వామివారి  వైభవం 

TIRUMALA, 17 JULY 2026: The pleasant evening on Friday witnessed Sri Malayappa along with His two consorts, taking a majestic ride on the colourfully decked Pushpa Pallaki at Tirumala in connection with Anivara Asthanam.

Every inch of the galleries of mada streets was occupied with devotees chanting Govinda… Govinda… braving drizzles.

TTD EO Sri Ravichandra, Additional EO Sri Ch Venkaiah Chowdary and others were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

పుష్ప పల్లకీపై శ్రీ భూ సమేత మలయప్పస్వామివారి  వైభవం 

జూలై 17,  తిరుమల 2026: ఆణివార ఆస్థానం సందర్భంగా శుక్రవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై తిరుమల పురవీధుల గుండా విహరిస్తూ భక్తులకు కనువిందు చేయనున్నారు.

టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పల్లకీ ముందువైపు శ్రీ మహావిష్ణువు, ఇరువైపులా, జయ విజయులు, మధ్యలో ద్వారక కృష్ణుడు, వెనుకవైపు శ్రీ ఆంజనేయస్వామివారి సెట్టింగులను ఏర్పాటు చేశారు. 

అదేవిధంగా రోజాలు, చామంతి, లిల్లి, మొలలు, మల్లి, కనకాంబరం, తామరపూలు, వృక్షి తదితర 9 రకాల సాంప్రదాయ పుష్పలు, 5 రకాల కట్‌ ఫ్లవర్స్‌ను వినియోగించారు. 

అదేవిధంగా వివిధ సాంప్రదాయ పుష్పలు, కట్‌ ఫ్లవర్స్‌తో విశేష అలంకరణలు చేశారు. 

టీటీడీ ఈఓ శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈఓ శ్రీ సి హెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు, పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.