TTD CHAIRMAN VISITS SHRAVANAMశ్రవణం విద్యార్థులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం: టిటిడి ఛైర్మన్

Tirupati, 09 December 2024: The Chairman of the TTD Trust Board Sri BR Naidu said that the Shravanam Institute of TTD will provide better facilities to the students with hearing impairment.

TTD Chairman on Monday evening inspected the Hearing training center for the impaired infants and children classes along with the officials concerned.

On this occasion, the  Chairman said that the problems of the students in the hearing centre have been brought to their notice and major facilities will be provided to the children soon.  

TTD board member Sri. Bhanu Prakash Reddy brought to his notice that the building where the children are staying is facing problems during the rainy season and they will provide better facilities soon.  

Better quality Hearing and more nutritious food have been sought by the mothers of the infants and soon the issues will be addressed.

Board Member Sri. Bhanuprakash Reddy, TTD JEO Smt. Gauthami, Shravanam Incharge Dr. P. Kishore Kumar, TTD SE Sri. Jagadeeshwar Reddy, AVSO Sri Mohan Reddy, Shravanam President Smt.  Kanakadurga, Secretary Smt Pushpalatha and concerned officers were present. 

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రవణం విద్యార్థులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం: టిటిడి ఛైర్మన్

తిరుపతి, 09 డిసెంబర్ 2024: టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రవణం విద్యార్థులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు తెలిపారు.

ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ సోమవారం సాయంత్రం శ్రవణం కేంద్రాన్ని, చిన్నారుల శిక్షణ తరగతులను అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ మాట్లాడుతూ, శ్రవణం కేంద్రంలోని విద్యార్థుల సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని, చిన్నారులకు ప్రధాన సౌకర్యాలను త్వరలో కల్పిస్తామన్నారు. చిన్నారుల ఉంటున్న భవణం అక్కడక్కడా వర్షా కాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు టిటిడి బోర్డు మెంబర్ శ్రీ భాను ప్రకాష్ రెడ్డి తమ దృష్టికి తీసుకువచ్చారని, త్వరలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. చిన్నారులకు వినికిడి యంత్రాలు సరఫరా చేయాలని, మరింతగా పౌష్టికాహారం అందించాలని
వారి తల్లులు కోరారు. శ్రవణం భవణంలో అక్కడక్కడా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, తక్షణమే సాంకేతిక అంశాలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు మెంబర్ శ్రీ జి.భానుప్రకాష్ రెడ్డి, టిటిడి జేఈవో శ్రీమతి గౌతమి, శ్రవణం ఇంఛార్జి డా.పి.కిషోర్ కుమార్, టిటిడి ఎస్ ఈ శ్రీ జగదీశ్వర్ రెడ్డి,
ఏవీఎస్వో మోహన్ రెడ్డి, శ్రవణం ప్రెసిడెంట్ శ్రీమతి ఎన్. కనకదుర్గ, సెక్రటరీ శ్రీమతి పుష్పలత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడింది