KARTHIKA DEEPOTSAVAM HELD IN KT _ శ్రీకపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం

TIRUPATI, 07 DECEMBER 2022: The annual Karthika Deepotsavam was observed in Sri Kapileswara Swamy temple on Tuesday evening in Tirupati.

The traditional ghee-lit lamp was decorated at Kapileswara temple main Gopuram, Sri Kamakshi temple Gopuram and Dhwaja Stambham.

The Siva lingam and trishulam decked with lights in Unjal Mandapam stood as a special attraction.

Temple DyEO Sri Devendrababu, AEO Sri Parthasarathy, Superintendent Sri Bhupati and other temple staff were present.

Devotees participated in large numbers.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీకపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం
తిరుపతి, 2022 డిసెంబర్ 06: తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని మంగళవారం  సాయంత్రం కృత్తికా దీపోత్సవం జరిగింది.
సాయంత్రం 6 గంటలకు గర్భాలయంలో, ఆ తరువాత శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయ గోపురం, శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ గోపురం, ధ్వజస్తంభంపైన దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఊంజల్‌ మండపంలో ఆకట్టుకునేలా శివలింగం, శూలం ఆకృతిలో ప్రమిదలు వెలిగించారు.ఆ త‌రువాత‌ జ్వోలాతోరణం వెలిగించారు.
ఈ కార్యక్రమంలో    ఆలయ‌ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ పార్థసారథి,
సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.