GRAND ARUDRA DARSHAN MAHOTSAVAM AT SRI KAPILESWARA SWAMY TEMPLE _ శ్రీకపిలేశ్వరాలయంలో ఘనంగా ఆరుద్ర దర్శన మహోత్సవం

Tirupati, 10 Jan. 20: The holy and unique ritual of Sri Arudra darshan Mahotsavam was conducted with grandeur at the Sri Kapileswara Swamy Temple on Friday morning after Dhanur masam pujas.

After procession of utsava idols of Sri Shivagami Sameta Nataraja and Sri Manikyavasa rudrabhisekam and diparadhana were conducted.

Temple DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupathi, temple inspector Sri Reddy Sekhar, archakas, officials participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

 

శ్రీకపిలేశ్వరాలయంలో ఘనంగా ఆరుద్ర దర్శన మహోత్సవం

తిరుప‌తి, 10 జ‌న‌వ‌రి 2020: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం ఆరుద్ర దర్శన మహోత్సవం ఘనంగా జరిగింది.

ధనుర్మాస నైవేద్యం సమర్పించిన అనంతరం ఉదయం 5.30 నుండి 9.30 గంటల వరకు శ్రీ శివగామి సమేత నటరాజ స్వామివారు, శ్రీ మాణిక్యవాసగర్‌ స్వామివార్లను పురవీధుల్లో ఊరేగించారు. ఆ త‌రువాత రుద్రాభిషేకం, సాయంత్రం శాస్త్రోక్తంగా దీపారాధన చేపట్టారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.