BHOGI TERU HELD _ శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా భోగి తేరు
Tirupati, 13 January 2025: The Bhogi Teru festival was celebrated on Monday at Sri Govindaraja Swamy temple in Tirupati.
From 5.30 pm to 7 pm, Sri Andal Ammavaru and Sri Krishnaswamy were carried on the Bhogi Teru on a procession conducted along the four streets of the temple.
Temple Deputy EO Smt. Santi, AEO Sri Muni Krishna Reddy, others and a large number of devotees participated in this program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా భోగి తేరు
తిరుపతి, 2025 జనవరి 13: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో సోమవారం భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. ఉదయం 5.30 నుంచి 6.30 గంటల వరకు భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పించారు.
సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారిని భోగి తేరుపై కొలువుదీర్చి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు..
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈఓ శ్రీ ముని కృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనంజయ రావు, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.