KOIL ALWAR TIRUMANJANAM AT SRINIVASA MANGAPURAM _ శ్రీనివాసమంగాపురంలో వేడుకగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirupati, February 13, 2025: Tirupati, 13 February 2025: The  Koil Alwar Tirumanjanam was celebrated at Sri Kalyana Venkateswara Swamy temple in Srinivasa Mangapuram on Thursday in view of the annual Brahmotsavam February 18 to 26.

Koil Alwar Tirumanjanam was conducted in the temple from 6.30 am to 10.30 am.   

After purifying the temple premises, walls, roof, worship materials and other things with water, holy water mixed with spices such as namakopu, srichurnam, musk, turmeric, pachaku, gadda camphor, sandalwood powder, saffron, kichiligadda and other spices were smeared throughout the temple.  

After that, the devotees were allowed to have Sarvadarshan.

DONATION OF 2 CURTAINS

On this occasion, Sri Paradala Mani of Tirupati donated two Paradas and two Kuralas to the temple.

Temple Special Grade Deputy EO Smt. Varalakshmi, AEO Sri. Gopinath, Temple Priests Sri. Balaji Rangacharya, Superintendent Sri. Raj Kumar and other officials and staff members of the temple participated in this program.

Ankurarpanam on February 17

The Brahmotsavam with the penultimate religious event on the evening of February 17 with Ankurarpanam at the temple of Sri Kalyana Venkateswara Swamy.

 Vahana Sevas:                                                                            

 18-02-2025

 Morning – Dhwajarohanam           

 Night – Peddasesha 

 19-02-2025        

 Chinna Sesha Vahanam                

 Hamsa Vahanam

 20-02-2025            

 Simha Vahanam              

 Mutyapu Pandiri Vahanam

 21-02-2025          

Kalpavriksha Vahanam            

Sarvabhoopala Vahanam

 22-02-2025            

 Mohini Avataram 

 Garuda Vahanam

 23-02-2025              

 Hanumanta Vahanam        

 Golden Chariot,

 Gaja Vahanam

 24-02-2025              

 Suryaprabha Vahanam                    

Chandraprabha Vahanam

 25-02-2025          

Rathotsavam          

Aswa Vahanam

 26-02-2025            

 Chakra Snanam                                        

Dhwajavarohanam 

 ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీనివాసమంగాపురంలో వేడుకగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2025 ఫిబ్రవరి 13: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం గురువారం వేడుకగా జరిగింది. ఫిబ్రవరి 18 నుండి 26వ తేదీ వరకు ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం తెలిసిందే.

ఉదయం 6.30 నుండి 10.30 గంటల వరకు ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

2 పరదాలు విరాళం :

ఈ సందర్భంగా తిరుపతికి చెందిన శ్రీ పరదాల మణి రెండు పరదాలు, రెండు కురాళాలను ఆలయానికి విరాళంగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఏఈవో శ్రీ గోపీనాథ్, ఆలయ అర్చకులు శ్రీ నారాయణ చార్యులు, సూపరింటెండెంట్ శ్రీ రాజ్ కుమార్, ఇతర అధికారులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఫిబ్రవరి 17వ తేదీ అంకురార్పణ

శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 17వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. ప్రతి రోజూ వాహన సేవలు ఉదయం 8 – 9 గం.ల మధ్య, రాత్రి 7 – 8 గం.ల మధ్య జరుగనున్నాయి. 23వ తేదీన సాయంత్రం 4 – 5 గం.ల మధ్య స్వర్ణ రథం, 25వ తేదీన ఉదయం 8.40 – 9.40 గం.ల మధ్యన రథోత్సవం, 26వ తేదీన ఉదయం 10 – 10.20 గం.ల మధ్య చక్రస్నానం జరుగనుంది.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ
18-02-2025

ఉదయం – ధ్వజారోహణం (మీన‌ల‌గ్నం)

రాత్రి – పెద్దశేష వాహనం

19-02-2025
ఉదయం – చిన్నశేష వాహనం

రాత్రి – హంస వాహనం

20-02-2025
ఉదయం – సింహ వాహనం

రాత్రి – ముత్యపుపందిరి వాహనం

21-02-2025
ఉదయం – కల్పవృక్ష వాహనం

రాత్రి – సర్వభూపాల వాహనం

22-02-2025
ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)

రాత్రి – గరుడ వాహనం

23-02-2025
ఉదయం – హనుమంత వాహనం

సాయంత్రం – స్వర్ణరథం,

రాత్రి – గజ వాహనం

24-02-2025
ఉదయం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

25-02-2025
ఉదయం – రథోత్సవం

రాత్రి – అశ్వవాహనం

26-02-2025

ఉదయం – చక్రస్నానం

రాత్రి – ధ్వజావరోహణం

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.