BOOKLETS RELEASED _ శ్రీనివాస మంగాపురం బ్రహ్మోత్సవాల ప్రోగ్రాం బుక్ లెట్లను ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్

Tirumala, 02 February 2026: In connection with annual brahmotsavams at Srinivasa Mangapuram scheduled from February 8-16, TTD Chairman Sri BR Naidu along with the Additional EO Sri Ch Venkaiah Chowdary released the Brahmotsavams booklets.

The event took place at the Chairman Camp office in Tirumala on Monday.

Temple Spl Gr DyEO smt Varalakshmi and others were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీనివాస మంగాపురం బ్రహ్మోత్సవాల ప్రోగ్రాం బుక్ లెట్లను ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్

తిరుమల, 2026 ఫిబ్రవరి 02: శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 8 నుండి 16వ తేది వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రోగ్రాం బుక్ లెట్ లను తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వర లక్ష్మీ పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

08-02-2026

ఉదయం – ధ్వజారోహణం ( కుంభ ల‌గ్నం- ఉ. 8.15 నుండి 8.35 గంటల వరకు)

రాత్రి – పెద్దశేష వాహనం

09-02-2026

ఉదయం – చిన్నశేష వాహనం

రాత్రి – హంస వాహనం

10-02-2026

ఉదయం – సింహ వాహనం

రాత్రి – ముత్యపుపందిరి వాహనం

11-02-2026

ఉదయం – కల్పవృక్ష వాహనం

రాత్రి – సర్వభూపాల వాహనం

12-02-2026

ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)

రాత్రి – గరుడ వాహనం

13-02-2026

ఉదయం – హనుమంత వాహనం

మధ్యాహ్నం- వసంతోత్సవం (మ. 2 నుండి 3 గంటల వరకు)

సాయంత్రం – స్వర్ణరథం(సా. 4 నుండి 5 గంటల వరకు)

రాత్రి – గజ వాహనం

14-02-2026

ఉదయం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

15-02-2026

ఉదయం – రథోత్సవం

రాత్రి – అశ్వవాహనం

16-02-2026

ఉదయం – చక్రస్నానం(ఉ. 9.55 నుండి 10.15 గంటల వరకు)

రాత్రి – ధ్వజావరోహణం( సా. 6 నుండి రాత్రి 7 గంటల వరకు)

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.